విధ్వంస రాముడే కనిపించాడు: కేటీఆర్‌

260
ktr vvr
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ సినీ,రాజకీయ ప్రస్థానం విజయవంతంగా ముందుకుసాగాలన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ యూసుఫ్‌ గూడలో జరిగిన వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మాట్లాడిన కేటీఆర్…పవన్ కల్యాణ్ ఇక్కడ లేరని ఈ మధ్య రెండు మూడు సార్లు మాట్లాడుకున్నామని చెప్పారు.

‘రంగస్థలం’ సమయంలో చరణ్‌ని కలిసినప్పుడు గడ్డంతో కనిపించాడు. ‘ఓ పల్లెటూరి సినిమా చేస్తున్నా’ అన్నాడు. చరణ్‌ని అలాంటి పాత్రలో ఊహించలేక ‘ఆ సినిమా చచ్చినా చూడను’ అన్నాను. కానీ చూసిన వాళ్లంతా ‘చాలా బాగుంది’ అంటుంటే.. అప్పుడు చూశా. తన కెరీర్‌లో అత్యుత్తమ నటన కనబరిచారని కొనియాడారు కేటీఆర్.

‘ఆ గట్టునుంటావా… ఈ గట్టుకొస్తావా’ అనే పాటని ఉదహరిస్తూ ఓట్లు అడిగాం. నా పాట వాడుకుంటున్నావ్‌ థ్యాంక్స్‌ అన్నాఅంటూ డీఎస్‌పీ సందేశం పంపాడు.పాటైతే వాడుకున్నా గానీ డబ్బులైతే ఇవ్వను అన్నానని తెలిపారు. ఈ సినిమా చిరంజీవి అభిమానులకు పండగలా ఉంటుందని అనుకుంటున్నానని తెలిపారు. ట్రైలర్‌లో విధ్వంస రాముడే కనిపించాడని తెలిపారు.

vvr

స్వయంకృషితో ఎదిగి, భారత చలన చిత్ర పరిశ్రమలో దిగ్గజంగా మెగాస్టార్ చిరంజీవి మారారని తెలిపారు. ఎన్నికల వేళ మేం ఇచ్చే ఉపన్యాసాల కంటే చరణ్‌ స్పీచ్‌ బాగుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా తను వస్తాడేమో చూడాలన్నారు. చిరు, చరణ్‌ అన్నా దమ్ముల్లానే ఉన్నారని… చరణ్‌ ఈమధ్య వరుసగా హిట్లు కొడుతున్నారని తెలిపారు.

కేటీఆర్‌ పనితీరు అందరికి ఆదర్శమన్నారు. సీఎం కేసీఆర్‌ విజన్‌ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడిన రామ్‌ చరణ్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -