టీఎస్‌ఐపాస్‌…సీఎం కేసీఆర్ మానసపుత్రిక: కేటీఆర్

317
ktr

టీఎస్‌ఐపాస్ సీఎం కేసీఆర్ మానసపుత్రిక అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ శిల్పకలావేదికలో టీఎస్ఐపాస్ ఐదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ ..రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతోందని..పర్యావరణహితంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు.

తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించామని…వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. పారిశ్రామిక కాలుష్యం లేని నగరంగా హైదరాబాద్‌ను మారుస్తున్నాం అన్నారు.

ఎస్సీ, గిరిజన పారిశ్రామికవేత్తలకు రూ. 305 కోట్ల రాయితీలు అందజేశాం అన్నారు. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు కార్మికులకు జీవనాధారం అని…. మెగా పరిశ్రమలు 30 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నాయి…. ఎంఎస్‌ఎంఈలు 70 శాతం వరకు ఉపాధిని కల్పిస్తున్నాయని చెప్పారు. పరిశ్రమల వద్దే ఉద్యోగుల నివాసాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. చైనాతో పోటీ పడాలంటే సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలతో పాటు మెగా పార్కులు ఉండాలి… హైదరాబాద్‌ ఫార్మాసిటీని అతి త్వరలోనే ప్రారంభించబోతున్నాం అన్నారు.

IT Minister KT Ramarao Speaking at the 5th Anniversary Celebrations of TSiPASS in Hyderabad