100 శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజీనామా చేస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఏర్పాటు చేసిన రైతు సభలో పాల్గొన్న కేటీఆర్…కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. ఇన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ సర్కార్‌ను విడిచి పెడుదామా..? అని కేటీఆర్ ప్రజలను అడిగారు
రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు.. అక్కడ స్పీచ్ ఇస్తుండు.. తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన.. ఢిల్లీలో కూడా ఉద్ధరిస్తానని, మీరు నా మాట నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశాం అని చెప్పడం పెద్ద జోక్ అన్నారు. ఇది ప్రారంభం మాత్రమే.. రాష్ట్రమంతా ధర్నాలు పెడుతాం. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 15 వేలు ఇవ్వాలి రైతుభరోసా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. వానాకాలం రైతుబందును ఎగ్గొట్టిండు.. దాన్ని కూడా విడిచి పెట్టొద్దు అని కేటీఆర్ చెప్పారు.
రైతులను రుణమాఫీ పేరిట మోసం చేసిండు. రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేసేందుకు డిసెంబర్ 9న సంతకం పెడుతా అన్నాడు. కానీ పూర్తిగా రుణమాఫీ కాలేదు అన్నారు. రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే.. డేట్, ప్లేస్, టైమ్ నీ ఇష్టం.. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపించు. వంద శాతం రుణమాఫీ అయిందని రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ నేతలు రాజీనామా చేసి పోతాం అన్నారు.
Also Read:హరిహర వీరమల్లు…సాంగ్ వచ్చేసింది