కాంగ్రెస్ వాళ్ళు ఒక్కొక్క వర్గానికి ఎంతెంత బాకీ పడ్డారని ఇంటింటికీ, మనిషి మనిషికి చెప్పాలి అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రహమత్ నగర్ SPR హిల్స్ గ్రౌండ్ లో జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఇందాక నేను వస్తుంటే కారు దగ్గరకి ఇద్దరు ఆడబిడ్డలు వచ్చి రేవంత్ రెడ్డిని బూతులు తిట్టారు అన్నారు. ఉర్దూలో, తెలుగులో ఇన్ని బూతులు ఉంటాయని కూడా నాకు తెలియదు అన్నారు.
అన్ని తిట్లు తిట్టి వాళ్ళు ఒకటే మాట చెప్పారు.. అన్నా మీరు వచ్చి చెప్పే అవసరం లేదు .. మేమే ఒక దుర్గా దేవి లాగా, కాలిక దేవిలాగా కాంగ్రెస్ పార్టీ భరతం పడతామని చెప్పారు. ఒకటే ఇంట్లో కాంగ్రెస్ వాళ్ళు 43 దొంగ ఓట్లు రాయించారు … మొత్తం కలిపి వేల ఓట్లు రాయించారు అన్నారు కేటీఆర్.
Also Read:జూబ్లీహిల్స్..కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలి
జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ ‘కారు’ కావాలా, కాంగ్రెస్ ‘బుల్డోజర్’ కావాలా నిర్ణయించుకోవాలి…కాంగ్రెస్ కి ఓటేస్తే పక్కా మీ ఇంటికి రేవంత్ ‘బుల్డోజర్’ రావడం ఖాయం అన్నారు. గరీబోళ్ల ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి బుల్డోజర్లు పంపించి, హైదరాబాద్‌లో ఇళ్లు కూలగొట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి…కోర్టులు, చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఇవేవీ చూడకుండా పేదవాళ్ళ ఇండ్లపైకి బుల్డోజర్లను రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పంపుతుందన్నారు.

