కోటా వినుత కేసులో సంచలన ట్విస్ట్‌

5
- Advertisement -

జనసేన మాజీ నాయకురాలు కోటా వినుత డ్రైవర్ రాయుడు హత్య కేసులో సంచలన ట్విస్ట్‌. కోట వినూత హత్యకు టీడీపీ ఎమ్మెల్య బొజ్జల సుధీర్‌రెడ్డి స్కెచ్‌ వేసినట్లు ఆలస్యంగా కోట వినుత డ్రైవర్ తీసుకున్న సెల్ఫీ వీడియోలో బయటకు వచ్చింది.

వీడియోలో బొజ్జల సుధీర్‌రెడ్డి.. కోట వినూత దంపతులను హత్య చేసేందుకు రెండు సార్లు ఏ విధంగా కుట్ర చేశారు. ఆ కుట్రలు బెడిసి కొట్టడంతో తనకు భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి కోట వినూత ఏకాంత వీడియోలు తీయాలని పురమాయించడం వంటి విశయలాలను డ్రైవర్ రాయుడు బయటపెట్టారు.

కోట వినుత దంపతులు ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నారు. ఏం చేస్తున్నారన్న సమాచారం తనకు ఇవ్వాలని బొజ్జల సుధీర్‌రెడ్డి తనని బెదిరించి, భయపెట్టినట్లు వీడియోలో చెప్పాడు రాయుడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:‘కారు’ కావాలా..’బుల్డోజర్’ కావలా: కేటీఆర్

- Advertisement -