పట్టణాలే దేశ ఆర్ధిక వనరులు:కేటీఆర్

218
ktr
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ శాఖకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. పురపాలక శాఖ వార్షిక నివేదిక విడుదల చేసిన కేటీఆర్…భారతదేశానికి ఆర్థిక వనరులుగా పట్టణాలే ఉన్నాయని తెలిపారు. హరితప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్ ప్రణాళికబద్దమైన పట్టణాభివృద్ధి లేకపోతే మన నగరాలే శాపంగా మారుతాయన్నారు.

మెరుగైన జీవిన ప్రమాణాల కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వలస పోతున్నారని….తెలంగాణ జీఎస్‌డీపీలో 45 శాతం నుంచి 50 శాతం పట్టణాల నుంచే వస్తుందన్నారు. ప్రస్తుతం తెలంగానలో 9 పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్నాయని…15 మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారని చెప్పారు.

మున్సిపల్ వ్యవస్థ అనేది ప్రతివ్యక్తితో లింక్ అయి ఉందన్నారు.జనసాంద్రత పెరిగినప్పుడు మౌలిక వసతుల్లో ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. 2023 నాటికి తెలంగాణ పట్టణ జనాభా 50 శాతం దాటబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లు పాల్గొన్నారు.

- Advertisement -