KTR: కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసులుండవా?

4
- Advertisement -

లగచర్ల బాధిత రైతులకు మద్దతుగా మహబూబాబాద్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నాలో పాల్గొని ప్రసంగించారు కేటీఆర్. 14 ఏళ్ల కిందట ఇదే మనుకోట ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఓ కీలకమైన మలుపునకు కారణమైందన్నారు. మళ్లీ అదే మనుకోట ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ భూములు గుంజుకుంటా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్న కొత్త నియంతకు బుద్ధిచెప్పేందుకు సిద్దమైందన్నారు.

అసలు ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ లో లగచర్లలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి…అక్కడ ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు ఈ ముఖ్యమంత్రి మీద తిరగబడ్డారు అన్నారు. వారి భూములను తీసుకుంటామని చెబుతే మా ఆడ బిడ్డలు 9 నెలల పాటు ధర్నా చేసి నిరసన తెలిపారు.

9 నెలలుగా సొంత నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ ముఖ్యమంత్రి కి సమయం లేదు….కానీ ఎక్కే విమానం దిగే విమానం అన్నట్లుగా 28 సార్లు ఢిల్లీకి పోయిండు. కనీసం 28 పైసలు కూడా తేలేదు….సొంత నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పై ప్రజలు తిరగబడుతున్నారుఅన్నారు.

మొన్న అధికారులు పోతే ప్రజలు నిరసన తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి పోయి ఉంటే ఉరికించి, ఉరికించి కొట్టేవారు..ఎందుకంటే ఢిల్లీలో రైతులు ఏడాది పాటు ఆందోళన చేసి మోడీ లాంటి వ్యక్తినే నల్ల చట్టాల నుంచి వెనక్కి తగ్గేలా చేశారు అన్నారు.రైతుల పవర్ అంటే ఆ విధంగా ఉంటుంది. అలాంటి పవర్ ఉన్న రైతులతో రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు..సన్నకారు, బక్క చిక్కిన రైతులతో పెట్టుకున్న ఈ రేవంత్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్పే సమయం వస్తుందిఅన్నారు.

మా గిరిజన రైతుల కోసం కదులుతూ మనుకోటలో ధర్నా చేస్తామంటే…లగచర్లలో జరిగిన సంఘటన కు మనుకోటలో ధర్నా ఎందుకు అని డీజీపీ గారు ప్రశ్నించారు…కొండగల్ రైతుల కోసం ఒక్క మనుకోటలోనే కాదు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎక్కడక్కడ దళితులు, బీసీలు, గిరిజనులు ఉన్నారో అక్కడ ధర్నా చేస్తాం అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కుకటి వేళ్లతో పెకిలించే దాకా వదిలిపెట్టమని చెబుతున్నా…
ఎవనీ కోసం ఫార్మా విలేజ్. తన అల్లుడి కోసం పేదవాళ్ల భూములను గుంజుకుంటున్నాడు అన్నారు.

ఈ ముఖ్యమంత్రి తన సొంత అల్లుడు, అదానీ, అన్నగాడు, తమ్ముని కోసం తప్ప రాష్ట్ర ప్రజల కోసం పని చేస్తలేడు…మరో 10 రోజులైతే రేవంత్ రెడ్డి పాలనకు ఏడాది అవుతుందన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. 420 హామీలు ఇచ్చారా? ఒక్క హామీనైనా నెరవేర్చారా?, ఇక్కడున్న డోర్నకల్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు దీనికి సమాధానం చెప్పాలి అన్నారు.

కేసీఆర్ ఉన్నప్పుడు రైతుబంధు టైమ్ వస్తుండేనా, రైతు బీమా వచ్చిందా, 24 గంటలు కరెంట్ వస్తుండేనా? ,రేవంత్ రెడ్డి వచ్చాక రైతుబంధు ఎగ్గొంట్టిండు. ఫించన్ పెంచలేదు. బోనస్ బోగస్ అయ్యింది. ఆడ బిడ్డలకు మహాలక్ష్మి స్కీం వచ్చిందా? ,మహారాష్ట్రకు పోయి కూడా ఆడబిడ్డలను మోసం చేసే ప్రయత్నం చేస్తే అక్కడి ఆడబిడ్డలు బుద్ధి చెప్పారు అన్నారు.

వీడు పచ్చి లంగా, తెలంగాణలో ఆడబిడ్డలను మోసం చేశాడని చైతన్యం ప్రదర్శించి తన్ని తన్ని తరిమేశారు…నేను ఇక్కడి వస్తుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతమని అంటున్నారు. నేను డీజీపీ, ఎస్సీ గారిని అడుగుతున్నా రాళ్లతో కొడతామంటే పోలీసులు ఏం చేస్తున్నారు..
కేసులు మా మీద మాత్రమే పెడుతారా? కాంగ్రెస్ ఎమ్మెల్యే ల మీద కేసులు ఉండవా? అన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతమంటే, పెట్రోల్ పోస్తామంటే భయపడతామా? మేము కేసీఆర్ తయారు చేసిన దళం. భయపడే ప్రసక్తే లేదు. ..మనుకోట రాళ్ల మహత్యం ఏందో తెలంగాణను అడ్డుకున్న వాళ్లందరికీ తెలుసు. మనుకోటలో 14 ఏళ్ల క్రితమే నిప్పు పుట్టి ఆ తర్వాత తెలంగాణ వచ్చింది. ఇవ్వాళ మీరు పర్మిషన్ ఇవ్వకుంటే హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నాంవెయ్యి మంది అనుకుంటే 25 వేల మంది వచ్చారు. అంటే ప్రభుత్వం మీద ఎంత కోపం, వ్యతిరేకత ఉందో ఈ మనుకోట మహాధర్నా చూస్తే అర్థమవుతోందన్నారు..

లగచర్లలో 30 మంది రైతులను జైల్లో పెడితే మా బంజారా ఆడబిడ్డలు భయపడలేదు…జ్యోతి అనే గర్భిణీ సోదరి ఢిల్లీ కి వద్దమ్మ అంటే కూడా రేవంత్ రెడ్డి భరతం పడతా అంటూ ఢిల్లీకి వరకు వచ్చిందన్నారు. అక్కడ ఎన్ హెచ్ఆర్సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళ కమిషన్ సభ్యులకు వాళ్ల బాధలు చెబుతుంటే కమిషన్ సభ్యుల కళ్లలో నీళ్లు వచ్చాయి..కానీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలకు గిరిజన బిడ్డల కష్టాలు కనిపించటం లేదు. మాత్రం ఏమాత్రం బాధ అనిపించటం లేదు…లగచర్లలో జరిగినట్లే రేపు మన అందరికీ రాష్ట్రంలో ఎక్కడైనా జరగవచ్చు అని మండిపడ్డారు.

ALso Read:మీ వాహనాలపై ఆ స్టిక్కర్లు ఉన్నాయా?అయితే!

- Advertisement -