టెక్ మహీంద్రా,సైయెంట్ ఐటీ కంపెనీలు వరంగల్‌కు రావడం ఆరంభం మాత్రమేనన్నారు మంత్రి కేటీఆర్. మడికొండలోని ఐటీ పార్క్‌లో సైయెంట్, టెక్ మహీంద్రా క్యాంపస్‌లను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కేటీఆర్ త్వరలో మరిన్ని కంపెనీలు రానున్నాయని చెప్పారు.
ఈ రెండు కంపెనీలతో 8 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఉండే అన్ని ద్వితియ శ్రేణి పట్టణాలకు ఐటీని విస్తరిస్తామన్నారు. ఐటీ కారీడార్‌ను మరింత విస్తరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సైయెంట్, టెక్ మహీంద్రా ప్రతినిధులు, మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
2016 ఫిబ్రవరిలో వరంగల్ ఐటీ సెజ్‌లో ఇంక్యుబేషన్ సెంటర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఐటీ సేవల కోసం 27 ఎకరాల్లో ప్రత్యేక ఆర్థిక మండలిని ప్రభుత్వం అభివృద్ధి చేసింది. మొదటి దశలో భాగంగా 2017లో 5 ఎకరాల్లో మూడు కంపెనీలను ప్రారంభించారు.