తెలంగాణలో పక్క లోకల్ పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ- కేటీఆర్

183
ktr
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరుసగా మూడో రోజూ నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మన్సూరా బాద్ చౌరస్తాలో కేటీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోలో కేటీఆర్‌తో పాటు మంత్రి జగదీష్ రెడ్డి,ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి,పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్, ఎమ్మెల్యే కంచర్ల భూపల్ రెడ్డి,ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ..మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి మీ కార్పొరేటర్ లను గెలిపించాలని కోరుతున్నాను. జిహెచ్ఎంసి ఎన్నికలు వచ్చయి అయితే గత ఎన్నికల్లో ఎల్బీనగర్ డివిజన్ లో 11 స్థానాలు గెలిపించారు. అందుకే 5 యేండ్లలో ఎం చేశామో చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని ఒకరు.. తెలంగాణ వస్తే కొలువులు రావని ఒకరు.. తెలంగాణ వస్తే పాలించే సత్తా ఉందా అని మరొకరు అన్నారు. మరి తెలంగాణ రాకముందు మంచి నీళ్ళు సమస్య 15 రోజులకు ఒక్కసారి నీళ్లు వచ్చేవి కానీ ఇవాళ దినము తప్పించి దినం వస్తున్నాయన్నారు మంత్రి.

తెలంగాణ వస్తే కరెంట్ కష్టాలు వస్తాయి అన్నారు కానీ అప్పుడు కరెంట్ వస్తే వార్త,ఇప్పుడు కరెంట్ పోతే వార్త.. తెలంగాణ వస్తే ఎం అయిందో ఈ వెనుక ఉన్న ఫ్లై ఓవర్ నిదర్శనం. విజయవాడ పోవాలి అంటే ఎల్బీనగర్ లో ట్రాఫిక్ జామ్ కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పేదవాడికి ఆకలి అయితే 5 రూపాయల కె అన్నపూర్ణ అన్నం పెట్టినం. పేదవాడు బిడ్డకు పెళ్లి చేయాలి అంటే కల్యాణ లక్ష్మీ ,పేదవాడికి రూపాయికే కిలో బియ్యం ఇచ్చినం. అంతేకాదు ఇవాళ ముఖ్యమంత్రి చెప్పారు పేదవాడికి ఇంటికి నల్ల బిల్లు మాఫీ అని చెప్పారు. ఇంటి పన్నులో 50 శాతం రాయితీ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. అలాగే త్వరలోనే డబల్ బెడ్ రూమ్ లు ఇస్తాం అని కేటీఆర్‌ అన్నారు.

రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి పేదవారికి ఎం చేశారో చెప్పాలి. వరదలు వస్తే మీ దగ్గరకు వచ్చాము, కరోనా వస్తే మీకు అండగా ఉన్నాము. వరదలు వస్తే అండగా ఉండేందుకు ఆసరాగా 10 వేలు ఇద్దాం అని సీఎం కేసీఆర్ ప్రకటిస్తే నోటి కాడి బుక్కను అందనివయలేదు. లెటర్ రాసి పేదలకు ఇచ్చే సాయం కు అడ్డు పడ్డారు. మేము వస్తే 25 వేలు ఇస్తాం అంటున్నారు అయితే 10 వేలు ఇవ్వనియ్యని వాడు 25 వేలు ఎక్కడ ఇస్తాడని మంత్రి ప్రశ్నించారు. వరద సాయం రానివారికి ఎన్నికల తరువాత మళ్ళీ ఇచ్చే బాధ్యత మాది. 2 లక్షల 72 వేల రూపాయల పన్ను కడితే మనకు ఎంతో వచ్చిందో తెలుసా రూపాయి కడితే ఆటన కూడా రాలేదన్నారు.

ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు హుషారు హైదరాబాద్ యాదికి ఉంచుకో. ఈ మధ్యన మార్కెట్ లోకి కొత్తయన వచ్చాడు పిల్లను రెచ్చగొట్టేందుకు పిల్లలకు చాలన్ లు వేస్తున్నారు మేము అధికారంలోకి వస్తే మేము కడుతాం అంటున్నాడు సిగ్గు ఉందా ఆయనకు. ఈ చట్టం తెచ్చింది ఎవరూ ఢిల్లీలో చట్టం తెచ్చింది కేంద్రంలోని నితిన్ గడ్కరీ ఇక్కడేమో ఈయన గారు చాలన్ మాఫీ అంటాడు ఇదేనా పద్ధతి. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాతో వ్యాపారం దెబ్బతిన్న నాయి బ్రాహ్మణ లకు విద్యుత్ ఉచితంగా ఇస్తాం అన్నారు.

హైదరాబాద్ లో మతకలోహాలు లేవు కర్ఫ్యూ లేదు కాబట్టే హైదరాబాద్ కు ఆమెజాన్, ఆపిల్ వంటి సంస్థలు వచ్చాయి. కానీ విల్లు వస్తే హిందు ముస్లింల ఘర్షణలు అవుతాయి. నగరంలో ఇంకా చేయాల్సిన పని ఉంది. వరదలు వస్తే ఇంట్లోకి నీళ్లు రాకుండా చేసే బాధ్యత మాది. భవిష్యత్తులో కాలనీలు మునగకుండా చూస్తాం.. ఎలాంటి హైదరాబాద్ కావాలి.. కొట్లాటలు చేసే హైదరాబాద్ కావాలా.. హిందు ముస్లిం గొడవలు చేసే హైదరాబాద్ కావాలా.. తెలంగాణలో పక్క లోకల్ పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ నే..గల్లీ పార్టీ కావాలా ఢిల్లీ పార్టీ కావాలా ఒకటవ తేదీనాడు టీఆర్‌ఎస్ పార్టీ కి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్న అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -