KTR:ఆలయాలు కాదు అభివృద్ధి ఏంటో చెప్పాలి?

10
- Advertisement -

మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని కర్మన్ ఘాట్ లో జరిగిన రోడ్ షో లో పాల్గొని ప్రసంగించారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ అయితే హైదరాబాద్ బాగు పడుతదని మీరు నమ్మారు..గ్రేటర్ పరిధిలో మాకు 16 సీట్లు ఇచ్చారు. కానీ జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోయారన్నారు.రూ. 2500, వృద్ధులకు రూ. 4 వేలు, రైతు భరోసా, తులం బంగారం అంటూ అలవి కానీ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు.,ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్నాం అన్నారు.

కానీ రేవంత్ రెడ్డి నాలుగు నెలల్లో ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకోలేదు…పైగా రాహుల్ గాంధీ తో కూడా పచ్చి అబద్దాలు చెప్పించినారు.,నిర్మల్ సభలో రాహుల్ గాంధీ ప్రతి మహిళకు రూ. 2500 వచ్చినయ్ అని చెబుతుండు,నాకు నవ్వాలో…ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. రూ. 2500, వృద్ధులకు రూ. 4 వేలు, తులం బంగారం, స్కూటీలు, రైతులకు రూ. 7500, బోనస్ వచ్చాయా?,తెలంగాణ ప్రజలు పిచ్చోళ్లు ఏమీ చెప్పినా నమ్ముతారన్నట్లు మిమ్మల్ని తక్కువ అంచనా వేసి అబద్దాలు చెబుతున్నారన్నారు.

రాహుల్ గాంధీ అమాయకుడు. వాళ్లు రాసిచ్చింది చదువుతాడు, కానీ మీ రేవంత్ రెడ్డి అసలు ఈ ఎన్నికల తర్వాత నీతో ఉంటాడా చూసుకో అన్నారు. రాహుల్ గాంధీ చౌకిదార్ చోర్ అంటాడు. రేవంత్ రెడ్డి మాత్రం మోడీ బడే భాయ్ అంటాడు,రాహుల్ గాంధీ అదానీ ఫ్రాడ్ అంటాడు. రేవంత్ రెడ్డి అదానీ మేరా ఫ్రెండ్ అంటాడు,రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ ఫేక్ అంటాడు. రేవంత్ రెడ్డి మాత్రం గుజరాత్ మోడల్ తెస్తా అంటాడు,రాహుల్ గాంధీ లిక్కర్ స్కాం లేదు కేజ్రీవాల్ అరెస్ట్ తప్పు అంటాడు. రేవంత్ రెడ్డి మాత్రం కవితమ్మను అరెస్ట్ చేసుడు కరెక్టే అంటాడు,ఆరు గ్యారంటీల్లో 5 అమలు చేసిన అని రేవంత్ రెడ్డి హోర్డింగ్ లు పెట్టుకున్నాడు.,మహిళలకు రేవంత్ రెడ్డి రూ. 10 వేలు, వృద్ధులకు రూ. 16 వేలు, లక్షన్నర ఆడబిడ్డలకు లక్షన్నర తులాల బంగారం బాకీ ఉన్నాడన్నారు.

స్కూటీలు వచ్చుడు ఏమో కానీ కాంగ్రెస్ లూటీ మాత్రం మొదలైంది,ఒక్కసారి ఆలోచించండి,కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ కష్టాలు ఉండేనా?,ఇప్పుడు హైదరాబాద్ కరెంట్ పోతుందా. మా ఇంట్లోనే ఐదుసార్లు కరెంట్ పోయింది,మంచినీళ్లకు సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చేసినం అన్నారు. కృష్ణా, గోదావరి జలాలు తెచ్చే సోయి లేదు. మేము కట్టిన విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఇచ్చే చేతనైతలేదు,కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునే వాళ్లకు దండం పెట్టి చెబుతున్నా అన్నారు.

బీజేపీకి ఓటు ఎందుకు వేయాలంటే మేము గుడికట్టిన ఓటు వేయాలే అంటున్నారు,గుడి కట్టుడు ఒక్కటే ఓటు వేసేందుకు కారణమైతే కేసీఆర్ కట్టలేదా యాదాద్రి,దేవున్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నామా?,కేసీఆర్ గారు కాళేశ్వరం లాంటి ఆధునిక దేవాలయం కట్టిండు,రిజర్వాయర్లు, చెరువులను పూర్తి చేసిండు. వాటికి కూడా దేవుళ్ల పేర్లు పెట్టిండన్నారు. క్క ఆలయం కట్టినందుకే మోడీకి ఓటు వేస్తే…మరి యాదాద్రితో పాటు ఆధునిక దేవాలయాలు కట్టినందుకు కేసీఆర్ ఓటు వేయొద్దా? ఆలోచించాలన్నారు. పప్పు, ఉప్పు చింతపండు ధరలు పెరిగినయ్. అందుకే ప్రధానిని ప్రియమైన ప్రధాని కాదు. పిరమైన ప్రధాని అంటున్నారు,మోడీ ప్రధాని అయినప్పటికి ఇప్పటికీ క్రూడ్ ఆయిల్ ధర 16 డాలర్లు తగ్గింది,మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గిన తర్వాత కూడా పెట్రోల్, డిజీల్ ధరలు ఎందుకు పెరిగినయ్,ప్రజల ముక్కు పిండి రాష్ట్రాలకు వాటా దక్కకుండా సెస్ వేసి రూ. 30 లక్షల కోట్లు వసూలు చేసిండు,అదానీ, అంబానీ లాంటి పారిశ్రామిక వేత్తలకు రూ. 14 లక్షల కోట్లు రుణమాఫీ చేసిండు,నేను చెప్పింది అబద్దమైతే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా,పదేళ్లు ప్రధానిగా పనిచేసినోళ్లు దేవుని పేరుతో రాజకీయాలు చేస్తారా ఏం అభివృద్ధి చేసినవో చెప్పి ఓటు అడగాలె అని సవాల్ విసిరారు.

Also Read:ల్యాండ్ టైటిల్ యాక్ట్..నిజానిజాలేంటీ?

- Advertisement -