కోటి మాస్కులు పంపిణీచేయడం అభినందనీయం: కేటీఆర్

234
Ktr
- Advertisement -

ప్రతిమ సంచార వైద్యశాల ప్రారంభించడంతో పాటు కోటి మాస్కులు పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు మంత్రి కేటీఆర్. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్….కరోనా ఉందని మందు టీకా వచ్చే వరకు మొత్తం లాక్ డౌన్ చేసి ఇండ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందన్నారు.

కరోనా వల్ల ఎంతమంది చనిపోతారో తెలియదు కానీ ఆర్థిక ఇబ్బందులతో ఉద్యోగాలు ఎన్ని పోతాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితి ప్రభుత్వం వల్లనో ఏ ఒక్కరితోనో రాలేదు ..ఈ సమస్య ఒక్క మనదేశం లోనే కాదు ప్రపంచం ఈ ఛాలెంజ్ ను ఎదుర్కొంటోందన్నారు. కేవలం ప్రభుత్వం మాత్రమే దీనికి ఏదో చేయాలని అనుకొనే కంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలన్నారు.

మనదగ్గర 23వేల కేసులు నమోదు అయితే మరణాలు 300వరకే ఉంది ..అయినా కొంత మంది ఇంకా విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో రాజకీయాలు చేయడం ఎంతమాత్రం తగదన్నారు. పరీక్షలు చెయ్యట్లేదు డాటా దాస్తున్నారని అనవసర విమర్శలు చేస్తున్నారు అదే నిజమైతే మరణాలను ఎలా దాయగలం అన్నారు.

అక్కడక్కడ లోపాలు ఉన్నాయి లేవని అనడం లేదు కానీ వాటిని ఎలా సరి దిద్దాలో ప్రోత్సహించాలని కోరుకుంటున్న అన్నారు. రాబోయే కాలంలో ఆరోగ్య రంగానికి మనదేశానికి బంగారు అవకాశం రాబోతుందని గట్టిగా నమ్ముతున్నానని చెప్పారు. ఫార్మా రంగం అంటే కాలుష్యం అనే అపవాదం ఉంది కానీ మన రాష్ట్రం నుంచి పని చేస్తున్న నాలుగు ఫార్మా కంపెనీలు దూసుకు పోతున్నాయో చూస్తున్నాం అన్నారు.

78శాతం వైద్య పరికరాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కానీ అందులో మార్పు రావల్సిన అవసరం ఉందన్నారు. చైనా తో గొడవ కావడంతో 59యాప్స్ నిషేధించారు అంతవరకూ బాగుంది ఒక చైనాకు చెందిన వ్యక్తి కామెంట్స్ నాకు చాలా బాధ కలిగించింది. మీకు సమాధానంగా మీ వస్తువులు మా దేశంలో నిషేదిద్దామంటే ఒక్క వస్తువు లేదని పరువు తీశాడన్నారు.

- Advertisement -