తెలంగాణ ఉద్యమజ్వాల గీతం…నిసార్

326
nisar
- Advertisement -

తెలంగాణ వాగ్గేయకారుడు నిసార్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు మంత్రి హరీష్‌ రావు. తెలంగాణ ఉద్యమ జ్వాల గీతమై ప్రజల గొంతుకను వినిపించిన గొప్ప వ్యక్తి నిసార్ అన్నారు హరీష్‌. నిసార్‌కు కన్నీటి నివాళి అర్పిస్తున్నానని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు వెల్లడించారు హరీష్‌.

ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపిన హరీష్‌…తెలంగాణా పాటను సారవంతం చేసిన కళాకారుడు నిసార్ అని కొనియాడారు. ఆర్టీసీ కండక్టర్ గా పనిచేసిన నిసార్ తన పాటల ప్రయాణాన్ని అర్ధాంతరంగా ఆపేసిండన్నారు.

నల్లగొండ జిల్ల్లా ఉద్యమచైతన్యాన్ని ఆవాహన చేసుకొన్నవాడు. పేద ముస్లిం కుటుంబం లో పుట్టిన నిసార్ అనేక ఉద్యమాలకు పాటల ప్రాణవాయువు నిచ్చారన్నారు. ప్రపంచీకరణ మాయలో కరిగిపోతున్న తెలంగాణా జానపద సాంస్కృతిక రూపాలను తలపోస్తూ వలపోసిన వాగ్గేయకారుడు. పండు వెన్నెల్లలోన వెన్నెల్లలోన పాడేటి పాటలేమాయే అనే పాట తెలంగాణా ధూంధాం సభలలో పెద్ద ఆకర్షణ అన్నారు హరీష్‌.

- Advertisement -