KTR:దీక్షా దివస్ సాక్షిగా వచ్చేది మన ప్రభుత్వమే

7
- Advertisement -

తెలంగాణ ఉద్యమ జ్వాలలు మళ్లీ మెదిలేలా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పాదయాత్రలో చేసిన వ్యాఖ్యలు విప్లవాత్మకంగా మారాయి. “ఢిల్లీలో అర్ధరాత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన క్షణం, ఎన్నో ఓటములు, గాయాలు, కన్నీళ్లతో అలసిపోయిన ప్రజల హృదయాల్లో తొలి విజయం జ్వాల వెలిగింది” అని ఆయన భావోద్వేగంగా గుర్తుచేశారు.

ప్రస్తుత కాలంలో మోసం విజయాన్ని చవిచూసినప్పుడు, గ్రామ సింహాలైనా మొరుగుతాయి, వానపాములైనా నాగుపాముల్లా బుసలు కొడతాయని ఉదాహరణ ఇచ్చిన కేటీఆర్, జీవితంలో ఒక్కసారైనా “జై తెలంగాణ” అనని వ్యక్తులు నేడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం దౌర్భాగ్యమన్నారు.

“420 హామీలు, 6 గ్యారంటీలు అంటూ ప్రజలను మోసం చేసి గెలిచిన వాళ్లకు, వాళ్ల అయ్యలకు కూడా భయపడేది లేదు” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ తల్లి చేతిలోని బతుకమ్మను తొలగించి, కాంగ్రెస్ సంకేతంగా మరో బొమ్మను పెట్టారని ఆరోపించిన కేటీఆర్, ఇటీవలి నిర్ణయాలు తెలంగాణ ఆత్మాభిమానానికి అవమానకరమని పేర్కొన్నారు.

“సెక్రటేరియట్ ముందు రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టారు? తిరిగి మన ప్రభుత్వం వస్తే, దానిని తొలగించి అదే చోట తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠిస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు. దీక్షా దివస్ సాక్షిగా తిరిగి తెలంగాణ ఆత్మగౌరవానికి న్యాయం చేసే రోజు దగ్గరలోనే ఉందని కేటీఆర్ ప్రజలను ఉత్సాహపరిచారు.

Also Read:మనశంకర వరప్రసాద్ గారు..డిజిటల్ రైట్స్!

- Advertisement -