అమెరికాలోని డల్లాస్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…మిమ్మల్ని చూసి తెలంగాణ గడ్డ గర్విస్తున్నది. ఖండాలను దాటి తెలంగాణ నైపుణ్యాన్ని చాటిన మీ అందరికీ వందనం. తెలంగాణకు ప్రతీకగా నిలిచిన మీ అందరికీ అభివందనం అన్నారు.
అమెరికాలోని తెలంగాణవాసులను చూసి తెలంగాణ తల్లి గర్విస్తున్నది. పుట్టిన గడ్డకు వేలాది మైళ్ల దూరంలో ఉన్నా బతుకమ్మను మరచిపోలేదు. బతుకును ఇచ్చిన తెలంగాణను మీరు మరచిపోలేదు. దశాబ్ద కాలంగా ఎలాంటి ఉత్సాహం కనిపించిందో ఇప్పుడూ అలాగే కనబడుతున్నది. నిన్నటి వరకు తెలుగు వారికి రెండు రాష్ట్రాలే ఉన్నాయి అనుకున్నా.. కానీ నాకు నిన్ననే అర్థం అయింది మనకి రెండు కాదు మూడు రాష్ట్రాలు ఉన్నాయని.. అది టెక్సాస్‌లో ఉందని అని తెలిపారు.
Live: BRS Working President @KTRBRS is speaking at BRS Silver Jubilee Celebrations.
📍Dallas https://t.co/qpcwQyY2Nf
— BRS Party (@BRSparty) June 2, 2025
Also Read:ఓటీటీలో ‘చౌర్య పాఠం’..

