KTR:బీఆర్ఎస్‌ ఎప్పటికీ బీజేపీ టీం కాదు

25
- Advertisement -

బీఆర్ఎస్ ఎప్పటికి బీజేపీ టీం కాదన్నారు మాజీ మంత్రి కేటీఆర్.హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో భువనగిరి పార్లమెంట్ నియోజకవ్గ సన్నాహాక సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. బీజేపీ తో పొత్తు గతం లో లేదు భవిష్యత్ లో ఉండదు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి కి చెందిన ముగ్గురు ఎంపీ లను ,ఇద్దరు ఎమ్మెల్యేలను ఓడించింది బీ ఆర్ ఎస్ అన్నారు. కేసీఆర్ 45 యేండ్ల రాజకీయ జీవితంలో బీజేపీ తో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదని…బీఆర్ఎస్ కు బీజేపీ బీ టీం అయితే ఎమ్మెల్సీ కవిత పై కేసు పెట్టేదా ? అన్నారు.

కవిత అరెస్టు కాకపోవడానికి కారణం సుప్రీం కోర్టు జోక్యం తప్ప బీజేపీ తో సంబంధాలు కారణం కాదు అని, కాంగ్రెస్ బీజేపీ లు కుమ్మకై బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని చూశాయన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ను ఓడించాయని,ఉపఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బీజేపీ ఒక్కట్టయ్యాయన్నారు. బీఆర్ఎస్ బీజేపీ లు ఒక్కటే అనే వారు శంకరాచార్యులు పీర్ల పండగకు ముడి పెడుతున్నట్టు లెక్క..కాంగ్రెస్ బిజెపి కుమ్మక్కు వల్లే రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ ఇచ్చారన్నారు.

అమిత్ షా ను రేవంత్ రెడ్డి కలవగానే ఎమ్మెల్సీ ఉపఎన్నికల పద్దతి మారిందని,ఎమ్మెల్సీ ఉపఎన్నికల తీరు పై హై కోర్టు కు వెళ్లినా మాకు నిరాశ తప్పలేదు అన్నారు. బీజేపీ మతాన్ని రాజకేయం కోసం వాడుకుంటోందని,మేము కూడా యాద్రాద్రి అక్షింతలను నల్లగొండ ,భువన గిరిల్లో పంచితే గెలిచే వాళ్ళమేమో అన్నారు. బీజేపీ వాళ్ళు పొలిటికల్ హిందువులు అయితే ..కేసీఆర్ మతాన్ని మతం గా చూసే హిందువు ..బీ ఆర్ ఎస్ నిజమైన సెక్యూలర్ పార్టీ అన్నారు. ఇక ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదని,పార్టీ చుట్టూ ఎమ్మెల్యే తిరిగే పద్ధతి ఉంటుందన్నారు. పార్టీ లో క్రమశిక్షణా రాహిత్యాన్ని సాధించం..కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటో కాల్ ఉల్లంఘనలు సీరియస్ గా తీసుకుంటాం .తప్పుడు కేసులను ఎదుర్కొంటాం అన్నారు. ఒక కాకికి ఆపద వస్తే మిగతా కాకులు ఒక్క చోట చేరినట్టే .బీ ఆర్ ఎస్ కార్యకర్త కు ఆపద వస్తే మిగతా కార్యకర్తలు చేరుకుని అండగా నిలవాలన్నారు.

Also Read:Prabhas:కల్కి రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -