బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గవర్నర్ తన తొలి ప్రసంగంలో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించామని చెప్పినా, వాస్తవంగా ఆ ఫైల్ ఎక్కడుందో ప్రభుత్వం స్పష్టం చేయలేకపోతుందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తొలి సంతకం చేసిన ఆరు గ్యారంటీల ఫైల్ ఎటు పోయిందని, అది ఎఫ్‌ఎస్‌ఎల్ అగ్నిప్రమాదంలో కాలిపోయిందా అని అనుమానం వ్యక్తం చేశారు.
అలాగే తొలి కేబినెట్ సమావేశాల్లో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత ఇస్తామని చెప్పిన రాహుల్ గాంధీ మాట ఏమైందని నిలదీశారు. మాయమైన ఆ ఫైల్‌ను కనుగొనేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు తుగ్లక్ పాలనలా ఉన్నాయని, వాటి ప్రభావంతో గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ప్రజలను ఎదుర్కోలేకపోతున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యే కేపీ వివేదకానంద కూడా ప్రభుత్వ పనితీరును తీవ్రంగా విమర్శించారు. “99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” అనే కార్యక్రమం సరైన విధివిధానం లేకుండా ప్రారంభించి, కొద్ది రోజుల్లోనే విఫలమైందని వ్యాఖ్యానించారు.
Also Read:ఖమేనీకి రక్షణగా నోపో బ్లాక్ క్యాట్స్!

