వ్యయ సమర్థత విషయంలో టాప్ 10 ఏరోస్పేస్ సిటీస్ కేటగిరిలో హైదరాబాద్ తొలి ర్యాంక్‌లో నిలిచిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. గురువారం పరిశ్రమలు, ఐటీ శాఖల వార్షిక నివేదికలను ఆయన విడుదల చేశారు. ఎఫ్‌డీఐ ఏరోస్పేస్ సిటీస్ ఆఫ్ ద ఫ్యూచర్ 2020-21 ర్యాంకింగ్స్ గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో 2019 ఏడాదికిగాను సులభతర వాణిజ్యంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచినట్లు చెప్పారు. ఇక నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ రిపోర్ట్‌లో ప్రధాన రాష్ట్రాల కేటగిరీలో రాష్ట్రానికి నాలుగోస్థానం దక్కినట్లు తెలిపారు.
ఇక ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీవో) 28వ కన్వర్జెన్స్ ఇండియా 2021 ఇంటర్నేషన్ ఎగ్జిబిషన్, 6వ స్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్‌పోలో హైదరాబాద్‌కు మూడు స్మార్ట్ సిటీస్ ఇండియా (ఎస్‌సీఐ) అవార్డులు దక్కినట్లు కేటీఆర్ చెప్పారు. గ్రీన్ అండ్ క్లీన్ సిటీ, స్మార్ట్ వేస్ట్ డిస్పోజల్, స్టార్టప్ కేటగిరీల్లో ఈ అవార్డులు వచ్చినట్లు తెలిపారు.