అభివృద్ధి వైపు ఉంటారా..? అరాచకం వైపు ఉంటారా..? ఆలోచించండి.. కేటీఆర్

163
ktr
- Advertisement -

శుక్రవారం మంత్రి కేటీఆర్ పీపుల్స్ ప్లాజాలో జరిగిన ఆర్య వైశ్య ఆత్మీయ అభినందన సభకు హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఎం.ఎల్.సి దయానంద గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కుల, మతాలకు అతీతంగా…సంక్షేమ, అభివృద్ధి పథకాలను జోడెద్దుల్లాగా సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళుతున్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ఎవరు ముందుకు తీసుకెళుతున్నారో ఆలోచించాలి. అటువంటి వారికి మద్దతు ఇవ్వాలని మంత్రి కోరారు. ఆర్య వైశ్యులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి. వైశ్య కార్పొరేషన్‌కు సంబంధించిన అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్‌ తెలిపారు.

రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే..శాంతి భద్రతలు అదుపులో ఉండాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డజను మంది కేంద్ర మంత్రులు..ఇప్పుడు ఏకంగా ప్రధాన మంత్రి వస్తున్నారు. లాక్ డౌన్ వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు వీళ్లు ఎవరైనా వచ్చారా..కన్పించారా..? అని మంత్రి ప్రశ్నించారు. హైదరాబాద్‌కు వస్తే ఎవరైనా రండి వచ్చేప్పుడు సీఎం కేసీఆర్ డిమాండ్ చేసిన రూ.1350 కోట్లు తీసుకురండి.. రూ.2.72 లక్షల కోట్లు కేంద్రానికి కడితే..మనకు కేంద్రం 1.40 లక్షల కోట్లు ఇచ్చింది. మాకే మీరు బాకీ ఉన్నారు అని మంత్రి దుయ్యబట్టారు.

కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌కు చేసిన కొత్త పని ఒకటి చూపండి అని కిషన్ రెడ్డికి సవాల్ చేస్తున్న..బీజేపీ నేతలు పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తారట..చొరబాటుదారులు, రోహింగ్యాలు ఉన్నారంటే..వారికి ఆధార్ కార్డ్ లు ఎవరిచ్చారు…?కేంద్రమే కదా..అని మంత్రి అడిగారు. హైదరాబాద్‌లో మత సామరస్యం దెబ్బతింటే గూగుల్, ఆపిల్ లాంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఏవి రావు. ఆలోచించండి.. అభివృద్ధి వైపు ఉంటారా..?అరాచకం వైపు ఉంటారా..? 20 లక్షల కోట్ల ప్యాకేజిలో 132 కోట్ల మందికి 15వేలు రావాలా..ఎవరికైనా వచ్చిందా..? వ్యాపారులకు, వాణిజ్యం చేసే వారికి ఎవ్వరికీ రాలేదు..మరి డబ్బులు ఎవరికి పోయింది..అని మంత్రి విమర్శించారు. భాజపా హయాంలో ఉద్యోగాలు రావడం కాదు..ఉన్న ఉద్యోగాలు పోయాయి..ఎయిర్ ఇండియా, ఎల్.ఐ.సి అమ్మేశారు. రాష్ట్ర ప్రగతికి, హైదరాబాద్ పురోగతికి పనిచేసిన వారికి పనిమంతులకు పట్టం కట్టండి.. సోచో ఇండియా కావాలి మనకు అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -