టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు ‘హిమాన్షు’ తెలంగాణలో తెలియని వారుండరు. మనువడు అంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో ప్రేమ. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, కేటీఆర్ కొడుకు కల్వకుంట్ల హిమాన్షురావు. డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ హైద్రాబాద్‌లో నిర్వహించిన ‘బెహతర్ ఇండియా క్యాంపెయిన్’ పర్యావరణ విభాగంలో హిమాన్షు గోల్డ్ మెడల్ సాధించారు. వ్యక్తిగత విభాగంలో 29,482 కిలోల రీసైకిలబుల్ వేస్ట్‌ను హిమాన్షు సేకరించగా, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ మొత్తం 34,137 కిలోల రీసైకిలబుల్ వేస్ట్‌ను సేకరించి పాఠశాలల విభాగంలో మూడో స్థానంలో నిలిచింది.
రీసైకిలబుల్ వేస్ట్‌ను సేకరించడంలో మిగతా అందరికన్నా ముందు నిలిచిన తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు ఈ ఘనతు సాధించాడు. గురువారం ఢిల్లీలో జరిగిన ‘బెహతర్ ఇండియా క్యాంపెయిన్’ కార్యక్రమంలో బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా, విజేతలకు పతకాలు ప్రధానం చేశారు. హిమాన్షును డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ అనూప్ పెబ్బీ ప్రత్యేకంగా అభినందించారు.