KTR:సన్న బియ్యానికే బోనసా?

14
- Advertisement -

వరంగల్ – నల్గొండ – ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలో జరిగిన పార్టీ సన్నాహాక సమావేశంలో పాల్గొని ప్రసంగించారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..ఎన్నికల సమయంలో క్వింటాల్ కు వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు సన్న బియ్యానికి మాత్రమే ఇస్తామంటూ మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతోందన్నారు.

దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని… సన్న వడ్లకు మాత్రమే ఇస్తామంటున్న సన్నాసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే తప్పకుండా మీరు తీర్పును ఇవ్వాలె…2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చారన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన వాళ్లకు ఓటేద్దామా? పదేళ్ల పాటు నిజాయితీ గా పనిచేసిన కేసీఆర్ గారి అభ్యర్థికి ఓటు వేద్దామా?,2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ అన్నారు. వాటి ఊసేలేదు అన్నారు.కానీ సిగ్గు లేకుండా 30 వేల ఉద్యోగాలు ఇచ్చినా అని రేవంత్ రెడ్డి చెబుతున్నాడన్నారు.

కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చిన అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు..ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండానే 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన అని మనల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడన్నారు.మెగా డీఎస్సీ అన్నారు. ఎంట్రన్స్ పరీక్షకు ఫీజే పెట్టం అన్నారు. కానీ ఇప్పుడు టెట్ పరీక్ష కోసం ఐదు రెట్లు ఫీజు పెంచి రూ. 2 వేలు వసూలు చేస్తున్నారు…గెలిచే వరకు ఒక మాట. గెలిచిన తర్వాత మరొక మాట. ఇలాంటి ప్రభుత్వాన్ని ఓడించాలన్నారు.

Also Read:జాజికాయ పొడితో ఆ సమస్యలు దూరం!

- Advertisement -