రైతు కుటుంబానికి ధైర్యం చెప్పండని కేసీఆర్ మమ్మల్ని ఇక్కడికి పంపిండు అని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం పంట కొనక పోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న రైతు నుగూరే పాండురంగ్ కుటుంబాన్ని పరామర్శించారు కేటీఆర్.
రెండేళ్లు దయచేసి ధైర్యంగా బ్రతకండి, మళ్లీ కేసీఆర్ వచ్చి మిమ్మల్ని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటామని చెప్పమ్మన్నాడు అన్నారు కేటీఆర్. చనిపోయిన ప్రతీ రైతుకి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి అన్నారు.
కుటుంబంలో చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం ఇవ్వాలి … నువ్వు ధాన్యం కొనక, లంచం సిస్టం పెట్టి, కనీసం మార్కెట్ యార్డులో నీళ్లు కూడా లేవు.. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు. నిజంగానే ధాన్యం కొనడంలో ప్రభుత్వం రికార్డ్ సృష్టించి ఉంటే పాండురంగ్ అనే రైతు ఎందుకు చనిపోయాడు చెప్పాలని ప్రశ్నించారు.
కరోనా సమయంలో కూడా మేము 8500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం.. ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మకండి కావాలంటే కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్లి అడగండి అన్నారు.
Also Read:విక్రమ్ మాలిక్‌గా రాఘవ్ జుయల్

