బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఎంపీ రాహుల్ గాంధీపై మండిపడ్డారు. అవినీతికి కేరాఫ్ పార్టీ కాంగ్రెస్…ఆ పార్టీ నేత అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పీసీసీ పోస్టును రూ.50 కోట్లకు అమ్మారని ఎంపీ కోమటిరెడ్డి అన్నారని… ఒకరు పీసీసీ ప్రెసిడెంట్ పోస్టును విక్రయిస్తే మరొకరు కొనుగోలు చేశారని మండిపడ్డారు. ఇంత అవినీతి పార్టీలో ఉన్న రాహుల్ అక్రమాలపై లెక్చర్లు హాస్యాస్పదమని…అవినీతి అనేది స్కాంగ్రెస్ పేరులోనే ఉందని వెల్లడించారు.
టికెట్లు అమ్ముకున్నారని రేవంత్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులే ఈడీకి ఫిర్యాదు చేశారని… ఓటుకు నోటు కేసులో రేవంత్ ఇప్పటికే పట్టుబడ్డారు. స్వాతంత్య్రం వచ్చినతర్వాత కాంగ్రెస్ అవసరం లేదని గాంధీజీ అన్నారని గుర్తుచేశారు.
According to Telangana’s Congress MP Venkat Reddy;
One All India Congressman sells the TPCC post while another Buys it for ₹50 Crore
And Rahul Gandhi lectures the world on Corruption 🤔
Scamgress lives up to its Name pic.twitter.com/IQA3yzvPox
— KTR (@KTRBRS) October 20, 2023