KTR:పొలిటికల్ టూరిస్ట్‌లకు స్వాగతం

39
- Advertisement -

పొలిటికల్ టూరిస్ట్‌లకు తెలంగాణ స్వాగతం పలుకుందన్నారు మంత్రి కేటీఆర్. ప్రియాంక గాంధీ తెలంగాణలో త్వరలో పర్యటించనుండగా దీనిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాజ‌కీయ నిరుద్యోగులు యువ‌త‌ను రెచ్చ‌గొడుతున్నారు అని మండిపడుతున్నారు. ప‌దేండ్లుగా అధికారంలో లేక‌పోవ‌డంతో కాంగ్రెస్ పార్టీ ఫ్ర‌స్టేష‌న్‌లో ఉంద‌ని తెలిపారు.

ప్రియాంక గాంధీ త‌న పొలిటిక‌ల్ టూర్‌ను ఎడ్యుకేష‌న్ టూర్‌గా మార్చుకుని తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అందుతున్న వాటి ఫ‌లాల‌ను తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ ఉద్య‌మ‌కారుల బ‌లిదానాల‌కు కార‌ణ‌మైనందుకు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ త‌ర‌పున క్ష‌మాప‌ణ చెప్పాలి. సోనియా గాంధీ బ‌లిదేవ‌త అన్న వ్య‌క్తికే పీసీసీ చీఫ్ ప‌ద‌వి ఇచ్చారు. గాంధీ భ‌వ‌న్‌ను గాడ్సేకు అప్ప‌గించి త‌న అంతానికి కాంగ్రెస్ వీలునామా రాసుకుంది. కాంగ్రెస్ అమాయ‌క‌త్వ‌మో, ఆత్మ‌హ‌త్యా స‌దృశ్య‌మో తేల్చుకోవాలి అన్నారు.

Also Read:టీటీడీ..అప్‌డేట్

కాంగ్రెస్, బీజేపీల‌కు ఒక పాలసీ అంటూ ఉంటే దేశంలో నిరుద్యోగ స‌మ‌స్య ఉండేదే కాదన్నారు. నిరుద్యోగాన్ని పెంచి పోషించినందుకు కాంగ్రెస్, బీజేపీ యువ‌త‌కు క్ష‌మాప‌ణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వ రంగంలో 2.2 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఉద్యోగ‌ అవ‌కాశాలు క‌ల్పిస్తున్నామ‌న్నారు.

Also Read:డెలివరీ బాయ్‌గా రాహుల్

- Advertisement -