కడియం శ్రీహరి చేసిన ద్రోహం వరంగల్ లో ఏ నాయకుడు చేయలేదు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా చిట్ చాట్‌గా మాట్లాడిన కేటీఆర్…వరంగల్ ప్రజలను దారుణంగా మోసం చేసింది కడియం శ్రీహరి అన్నారు. ప్రపంచం వరంగల్ వైపు చూసేలా చేస్తా అంటున్న రేవంత్ రెడ్డి ముందుగా వరంగల్ కళతోరణం రాష్ట్ర అధికారిక ముద్ర లో తీసినందుకు క్షమాపణ చెప్పాలన్నారు.
మా మల్లారెడ్డి చాలా తెలివిగల వ్యక్తి.,,ఎవర్ని ఎప్పుడు మునిగే చెట్టు ఎక్కించి పడేస్తారో తెలియదు అన్నారు. మల్లారెడ్డి వ్యాఖ్యలు సీరియస్ గా తీసుకోవద్దు…ఆర్టీసి కి రావాల్సిన పెండింగ్ నిధులు ఇవ్వలేదు అన్నారు. ముందు అవి ఇచ్చి మాట్లాడండి…మేము ఆర్టీసీకి ఏం చేయాలేదు అనే కదా, మీకు అధికారం ఇచ్చింది, ఇప్పుడేం పీకుతారో చెప్పాలన్నారు.చేనేత కార్మికులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నారు..రాష్ట్రంలో రైతుల పరిస్థితి బాగాలేదు.గ్రామాల్లో మాత్రం ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.
కాళేశ్వరం విషయంలో కేసిఆర్ కి నోటీసులు ఇస్తామని గోష్ చెప్తున్నారు..నోటీసులు ఇవ్వండి చూద్దాం…కాళేశ్వరం లో ఏం జరిగిందో ఎలా ఉందో అన్ని చూపిస్తాం అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ లో బీజేపీ తో రాజీ పడింది..మేము అంశాలవారిగా మేము మద్దతు ఇచ్చామన్నారు.జిఎస్టీ కి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది..అలా అయితే కాంగ్రెస్ బీజేపీ ఒక్కటేనా అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు దేశానికి ద్రోహం చేశాయి..కేజ్రీవాల్ అరెస్ట్ సక్రమం కవిత అరెస్ట్ అక్రమం ఎలా అవుతుంది. రెండు ఒక్కటే కేస్ లు కదా అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ని ఎదుర్కొనే సత్తా లేదని…అందుకే వయనాడ్ వెళ్లి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నాడన్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి కదా అందుకే మహారాష్ట్ర వెళ్ళలేదు..మహారాష్ట్ర మంచి స్పందన వచ్చింది కానీ ఇక్కడ గెలువలేదన్నారు.
Also Read:KTR:పాలమూరులో ఓటమి దిశగా కాంగ్రెస్