కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు..ఆరు గారఢీలే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో జరిగిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన కేటీఆర్… కేకే, కడియం ఇలాంటి నాయకులు పార్టీ కష్ట కాలంలో వదిలిపెట్టి వెళ్తున్నారు… పోయే నాయకులు వెళ్లేటప్పుడు కొన్ని రాళ్లు వేసి వెళ్తారు… వాళ్ళు చేస్తున్న విమర్శలపైన వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను… కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందన్నారు.
ఈరోజు నాయకులు పార్టీని వదిలేసినా… పార్టీ శ్రేణుల కోసం నేను స్వయంగా పనిచేస్తా అన్నారు కేటీఆర్. ఇన్ని రోజులు పార్టీ కోసం, నాయకుల కోసం పనిచేసిన కార్యకర్తల కోసం నేను స్వయంగా వస్తా.. రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గెలిపించుకుంటా అని హమీ ఇచ్చారు కేటీఆర్. రంజిత్ రెడ్డి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరారు, 2014లో విశ్వేశ్వర్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఎంపీగా చేసినం, 2019లో రంజిత్ రెడ్డి మాదిరి పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరితే చేవెళ్ల ప్రజల చైతన్యంతో ఓడిపోయారన్నారు.
కేసీఆర్ కూతురు అరెస్ట్ అయిన రోజు నవ్వుకుంటూ కాంగ్రెస్ లోకి పోయిన రంజిత్ రెడ్డి… పట్నం మహేందర్ రెడ్డిల పైన మన పార్టీ కార్యకర్తలు పగ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలు మళ్ళీ వచ్చి కేసీఆర్ గారి కాళ్లు పట్టుకున్న పార్టీలోకి రానీయం అన్నారు. మల్కాజిగిరిలో పోటీ చేయాలని సీఎం కే విసిరిన సవాల్.. రేవంత్ రెడ్డి స్పందించలేదన్నారు. ఆయన సొంత సిట్టింగ్ ఎంపీ స్థానంలోనే పోటీకి వెనకంజ వేసిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సీట్లను గెలిపిస్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు… రేవంత్ రెడ్డి లీకువీరుడుగా మారిండు… ఎన్నికల హమీలపై ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే ఈ డ్రామాలు అన్నారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్ల కన్నా ఎక్కువ వచ్చే పరిస్ధితి లేదు.. బీజేపీని ఆపేందుకు బలమైన స్ధానిక నేతలే అని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే, అది బీజేపీ కి లాభం అవుతుంది… పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు… పార్టీకి అండగా ఉండేందుకు ముందుకు వచ్చిన గొప్ప నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు.బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని… ఆయన కేవలం రంగారెడ్డి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితుడన్నారు.
Also Read:4 ఎంపీ,9 అసెంబ్లీ.. టీడీపీ ఫైనల్ లిస్ట్