నేను చెప్పినట్లు వినలేదు.. ముఖ్యమంత్రి చెప్పినట్లు వింటున్నాడు అని అందుకే ఐఏఎస్ అధికారి రిజ్వి పెట్టుకున్న వీఆర్ఎస్‌ను ఆమోదించవద్దని ఎక్సైజ్ మంత్రి జూపల్లి లేఖ రాశాడు అన్నారు మాజీ మంత్రి కేటీఆర్.
లిక్కర్ టెండర్ తన కొడుకుకి రాలేదని.. రేవంత్ రెడ్డి అల్లుడికి వచ్చిందని ఆ అధికారి మీద కక్ష తీర్చుకోడానికి జూపల్లి చూస్తున్నాడు అన్నారు కేటీఆర్. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో రూ.500 కోట్ల టెండర్ కోసం సీఎం రేవంత్ రెడ్డి తన అల్లుడి కోసం, మంత్రి జూపల్లి తన కొడుకు కోసం టెండర్ పంచాయతీ పెట్టుకున్నారు అన్నారు.
వీరి మధ్యల నలగలేక సయ్యద్ అలీ మూర్తజా రిజ్వీ(ఐఏఎస్) అధికారి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు… సయ్యద్ అలీ మూర్తజా రిజ్వీ క్యాబినేట్ సెక్రటరీ స్థాయికి వెళ్ళే అవకాశం ఉన్న ఐఏఎస్ అధికారి, 10 ఏళ్ల సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు అన్నారు.
Also Read:అమెజాన్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్

