KTR:గెలుపు బీఆర్ఎస్‌దే

57
- Advertisement -

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసి కంగారు పడాల్సిన పనిలేదన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన రేవంత్..2018లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పని తేలాయన్నారు. చాలా మంది ఓటింగ్ కోసం క్యూ లైన్లలో నిల్చోని ఉన్నారని.. కేసీఆరే మళ్లీ సీఎం అవుతారు అని కేటీఆర్ స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. మళ్లీ అధికారం మాదే. హ్యాట్రిక్ కొడతాం.70కి పైగా సీట్లు గెలుస్తాం. డిసెంబర్ 3న మళ్లీ అధికారం చేపడతాం అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై కంగారు పడాల్సిన అవసరం లేదు. 2018లో ఇప్పటికే క్యూ లైన్లలో ఓటర్లు వేచి ఉండగా ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడించడమేంటన్నారు. డిసెంబర్ మూడో తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతారా? అని నిలదీశారు.

Also Read:బీఆర్ఎస్‌దే గెలుపు..సీఎం కేసీఆరే హ్యాట్రిక్ సీఎం

- Advertisement -