KTR:తెలంగాణపై కాంగ్రెస్ కుట్ర

58
- Advertisement -

న్యాయవాదుల అన్ని డిమాండ్లను నెరవేర్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన కేటీఆర్….అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణను తిరిగి కాంగ్రెస్ చేతిలో పెడతే ఆగమాగం అవుతామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే ఇక్కడి పరిశ్రమలను కర్ణాటకకు తరలించే దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ రాసిన లేఖను బయట పెట్టారు కేటీఆర్. కాబట్టి ప్రజలంతా ఆలోచించి మరోసారి బీఆర్ఎస్‌కే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఫాక్స్ కాన్ కంపెనీని బెంగళూరు రావాలని డీకే లేఖలో పేర్కొనడం కాంగ్రెస్ దమన నీతిని నిదర్శనమన్నారు.

న్యాయవాదుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లు కేటాయించిన ఏకైక సర్కార్ కేసీఆర్ సర్కార్ అన్నారు. అందుకే సీఎం కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు.సీఎం కేసీఆర్ లేకుంటే ఎంత ముప్పు వస్తుందో డీకే లేఖతోనే బయటపడిందన్నారు. తెలంగాణలో సమ్మిళిత అభివృద్ధి జరుగుతుందన్నారు.

అభివృద్ధి, సంక్షేమం అన్ని రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ ఉందన్నారు. రైతుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. కేసీఆర్ హయాంలో ఐటీ రంగంలో దూసుకుపోతున్నామన్నారు. హైదరాబాద్ వస్తే న్యూయార్క్ వచ్చినట్లు ఉందని రజనీకాంత్ అన్నారు… హైదరాబాద్‌లోనే ఉండి పోవాలని ఉందని సన్నీ డియోల్ అన్న మాటలను గుర్తు చేశారు. ఒక్క కేసీఆర్‌ని కొట్టడానికి అంతా ఏకమవుతున్నారు .. కేసీఆర్ సింహం లాంటోడు సింగిల్ గానే వస్తాడన్నారు.

Also Read:ఆ సినిమా స్టార్ హీరోని చేస్తోందట

- Advertisement -