KTR:ఖైరతాబాద్‌లో దానం ఓటమి ఖాయం

20
- Advertisement -

ఖైరతాబాద్‌లో దానం ఓటమి ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..త్వరలో ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక రాబోతుందని తెలిపారు. దానం నాగేందర్ ఓటమి పాలవుతున్నారని చెప్పారు. రాజ‌కీయాల్లో హ‌త్య‌లు ఉండ‌వు.. ఆత్మ‌హ‌త్య‌లు ఉంటాయి. త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకుంటే ఖ‌త‌మై పోతారని దానంను హెచ్చరించారు.

దానం అవ‌కాశవాద రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఖైర‌తాబాద్ ప్ర‌జ‌లు తెలుసుకున్నారు. ఆనాడు ఆసిఫ్‌న‌గ‌ర్‌లో దానం నాగేంద‌ర్ టీడీపీ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్‌లోకి వ‌చ్చారు. మ‌ళ్లీ ఉప ఎన్నిక‌లో ఓడిపోయారు. ఇప్పుడు కూడా అదే పున‌రావృతం కాబోతోందన్నారు.రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు స్పీక‌ర్ లోనైతే, వ‌దిలిపెట్ట‌కుండా సుప్రీంకోర్టుకు వెళ్తాం.. దానంను అన‌ర్హుడిగా చేసేదాకా పోరాడుతం. ఖైర‌తాబాద్‌లో మూడు, నాలుగు నెల‌ల్లో ఉప ఎన్నిక వ‌స్తుందని తేల్చిచెప్పారు.

సికింద్రాబాద్‌లో పోటీ మ‌న‌కు కాంగ్రెస్‌తో లేదు..బీజేపీతోనే ఉందన్నారు. దానంను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. ఈ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థి ప‌ద్మారావు గౌడ్ భారీ మెజార్టీతో గెల‌వ‌డం ఖాయం అని…2002 నుండి కేసీఆర్ వెంటే నడిచిన నాయకుడు పద్మారావు అన్నారు. ప‌ద్మారావు పేరు విన‌గానే సికింద్రాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలోని ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు, ప్ర‌జ‌ల‌కు విశ్వాసం క‌లిగిందన్నారు.

Also Read:కుప్పంలో బాబు స్ట్రాటజీ ఏంటి?

- Advertisement -