KTR:కాంగ్రెస్ – బిజెపిది ఫెవికాల్ బంధం

18
- Advertisement -

కాంగ్రెస్ – బీజేపీది ఫెవికాల్ బంధం అన్నారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్… రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థులను పెట్టి బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయడం అంటే బిజెపికి ఓటు వేసినట్లేనని…కాంగ్రెస్ బిజెపి మంచి అవగాహనతో కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఆదానిని తిట్టి…. అధికారంలోకి రాగానే దావోస్లో వెళ్లి ఒప్పందాలు చేసుకొని వచ్చారని…
ఎమ్మెల్సీ ఎన్నికల్లోను బిజెపి కాంగ్రెస్ కి లబ్ధి చేకూర్చేలా పనిచేసిందన్నారు.

బిజెపి ప్రతినిధిగా ఉన్న గవర్నర్ కూడా నామినేటెడ్ ఎమ్మెల్సీలు రాజకీయ నేపథ్యం అని మన పార్టీ అభ్యర్థులను తిరస్కరించింది… కానీ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కోదండరాం ను మాత్రం నా మినిట్ చేసిందని…రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రా అని తిరుగుతుంటే… కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు రాహుల్ చొడో అని వదిలి వెళుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అహంకారం వల్లనే ప్రతిపక్షాలు కాంగ్రెస్ని వదిలి వెళుతున్నాయన్నారు. ఆ కూటమిలో మిగిలేది చివరికి రాహుల్ గాంధీ ఒక్కరేనని చురకలు అంటించారు.

ఢిల్లీలో మోడీని ఆపాలంటే కాంగ్రెస్ పార్టీతో కాదని…బిజెపిని ఎదుర్కొనే శక్తి లేక మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇప్పటికే చేతులెత్తేసిందన్నారు. పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ, బీహార్ లోనితీష్ కుమార్, పంజాబ్లో ఆమ్ ఆర్మీ పార్టీ మాదిరే తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వానికి తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వాలని…మోడీ అపేది ముమ్మాటికీ బలంగా ఉన్న ప్రాంతీయ లీడర్లే అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.

బండి సంజయ్, అరవింద్, సోయం బాపూరావు, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, వంటి బిజెపి లీడర్లను ఓడించింది కాంగ్రెస్ కాదు టిఆర్ఎస్ అని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని…తెలంగాణ ప్రజల గొంతును పార్లమెంట్లో వినిపించ గలిగేది గులాబీ పార్టీ మాత్రమేనన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ వంటి పార్టీలకు వేయాలని…మోసం కాంగ్రెస్ నైజం… హామీలను ఎత్తగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు అన్నారు. ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లన్న ఒడ్డుకెక్కినంక బోడ మల్లన్న ఇదే కాంగ్రెస్ పార్టీ నైజం అన్నారు. రాష్ట్రంలో ఉన్న కోటిన్నర మంది అర్హులైన మహిళలకు రెండున్నర వేల రూపాయల మహాలక్ష్మిని పార్లమెంటు ఎన్నికలకు ముందే అందించాలన్నారు. వచ్చేనెల బిల్లు కట్టవద్దు సోనియా కడుతుందని రేవంత్ చెప్పిండు..మరి సోనియాగాంధీ ఈనెల బిల్లు కట్టిందా అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో షాక్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

Also Read:టిల్లు స్క్వేర్..గుడ్ న్యూస్

- Advertisement -