KTR:రేవంత్ బీజేపీ మనిషే..

62
- Advertisement -

ధరణి విదేశీ చేతిలో ఉందన్న రేవంత్ రెడ్డి గుర్తించాల్సిన మాట… కాంగ్రెస్ పార్టీ కూడా విదేశీ చేతుల్లోనే ఉందన్నారు. రేవంత్ రెడ్డి నోట్లో నుండి వేలకోట్ల మాట తప్ప ఇంకో మాట రాదు. ఆయనకు మతిస్థిమితం లేదన్నారు.తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్…రేవంత్, కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. సెక్రటేరియట్ కింద వేల కోట్లు ఉన్నాయని చేసిన పిచ్చి ఆరోపణలు అందరికీ గుర్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బిజెపి పైన ఒక మాట ఎందుకు మాట్లాడడని ప్రశ్నించారు. మోడీని బిజెపిని ఒక మాట అనకుండా రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు. అందుకే గాంధీ భవన్లో గాడ్సే దూరిండు అని మేము చెప్పామని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి 100% ఆర్ఎస్ఎస్ మనిషి, బిజెపి మనిషి అన్నారు.

మోడీని పల్లెత్తు మాట అనకుండా కాపాడుతున్న వ్యక్తి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సైతం అందించి విచారణ చేయించుకోవచ్చు అన్నారు. ధరణి ద్వారా జరిగిన లబ్ధిని మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ప్రజలకు చెప్తం. ఈ అంశాన్ని ప్రజలే తెలచాలని కోరుతాం అన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా అడ్డగోలుగా డబ్బులు సంపాదించిన రేవంత్ రెడ్డి… ఈరోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ అయితే ఓర్వలేక పోతున్నారన్నారు. ఆయన భూ దందాలు ధరణి ద్వారా సాధ్యమవుతలేదని ఆయన అక్కసు ఉందన్నారు.

Also Read:‘మిషన్ సౌత్’ రంగంలోకి మోడి..?

గత మూడు సంవత్సరాలలో భారత రాష్ట్ర సమితి మోడీ మీద బీజేపీ మీద చేసిన విమర్శలలో కనీసం 10% అయినా కాంగ్రెస్ పార్టీ చేసిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ బిజెపి కలిసే కదా కరీంనగర్ పార్లమెంటును గెలిచింది…ఆ తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికలలో కాంగ్రెస్ బిజెపి కలిసి పని చేసింది వాస్తవం కాదా అన్నారు. ఇవన్నీ ప్రజలు గుర్తుంచుకుంటారు. ప్రజలు అమాయకులు కాదు… ఎవరును మోడీని వ్యతిరేకించి, గట్టిగా నిలబడి కొట్టగలరో ప్రజలందరికీ తెలుసు అన్నారు. మోడీ పైన తలవంచకుండా పోరాటం చేసే వ్యక్తి ఎవరో దేశ ప్రజలందరికీ కూడా అవగాహన ఉందన్నారు. అందుకే మహారాష్ట్ర లాంటి చోట కూడా కేసీఆర్ పర్యటనలకు మంచి స్పందన వస్తుందన్నారు.

గత ఎన్నికల్లో కూడా మహాకూటమి పేరు కట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా… ప్రజలు వీపు పగలగొట్టి వెనక్కి పంపించారు…పేదవారి గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు …ఆయనను తిరిగి మళ్లీ గెలిపిస్తారన్నారు. నాలుగేళ్ల కింద మోడీని పచ్చి బూతులు తిట్టిన చంద్రబాబునాయుడు nda మీటింగ్ హాజరు ఎట్లా అవుతాడు… గత నాలుగు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి మోడీ చేసిన మేలు ఏమిటో చంద్రబాబు చెప్పాలి… గత తొమ్మిది సంవత్సరాల్లో ఆంధ్ర తెలంగాణకు మోడీ చేసిన మేలు ఏమిటో చెప్పి హాజరు కావాలన్నారు.

గత తొమ్మిది సంవత్సరాలుగా మోడీ దేశానికి ఏం చేసిండో అదైనా చెప్పాలన్నారు. అసలు రాహుల్ గాంధీని దేశంలో ఎవరు లీడర్ గా గుర్తిస్తున్నారో చెప్పాలని…పార్టీ అధ్యక్షుడు కాదు… పార్టీ ఎంపీ కూడా కాదు అన్నారు. ఏ హోదాలో ఆయన హామీలు ఇచ్చిండో చెప్పాలి… హోదాలేని నాయకులకు ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. 55 సంవత్సరాల పాటు తెలంగాణను రాబందులలా వేధించుకొని తిన్న కాంగ్రెస్ పార్టీ… రాహుల్ గాంధీ ముత్తాత నుంచి రాహుల్ దాకా కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలుసు. పాత రాబందులు నేడు బహు రూపు వేషాల్లో మళ్లీ వచ్చినంత మాత్రాన తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు.

Also Read:ఆ నటీమణులు షాకింగ్ కామెంట్స్

- Advertisement -