KTR: ఎవనిదిరా కుట్ర..ఏంది ఆ కుట్ర?

10
- Advertisement -

ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేటీఆర్. ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? అని దుయ్యబట్టారు. నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? ,నీ అల్లుని కోసమో, అన్న కోసమో…రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? అన్నారు.

గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా?..నీ ప్రైవేట్‌‌ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర? అని ప్రశ్నించారు.

నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు! రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను!, నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్‌ రెడ్డి..చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో అని సవాల్ విసిరారు.

Also Read:KTR:ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా!

- Advertisement -