అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టారు మాజీ మంత్రి కేటీఆర్. ఓట్లకు ముందు అభయ హస్తం.. ఓట్లు పడ్డాక శూన్య హస్తం అని ఎద్దేవా చేశారు. శాసనసభలో ద్రవ్య వినిమయం బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, పలు అంశాలపై కాంగ్రెస్‌ను సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం చూపించింది.. బడ్జెట్‌లో మాత్రం మోచేతికి బెల్లం పెట్టిందని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని చెప్పారు. 2022 మార్చి 15న ఇదే సభలో ప్రతిపక్ష హోదాలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ ప్రతి సంవత్సరం సంపద సృష్టిస్తున్నారు. రాష్ట్రాన్ని కరోనా అతాలకుతలం చేసినప్పటికీ ఆ దాడిని తట్టుకోని ఉత్పత్తిని, సంపదను పెంచడం జరిగిందన్నారు.
ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్ర ప్రజల బాగు కోరుతూ మీరు తీసుకునే నిర్ణయాత్మక నిర్ణయాలకు సహకారం అందిస్తాం అని చెప్పారు. బడ్జెట్‌లో శుష్క ప్రియాలు ..శూన్య హస్తాలు, గ్యారెంటీలకు టాటా.. లంకె బిందెల వేట, డిక్లరేషన్లు డీలా.. డైవర్షన్ల మేళా.., హామీ పత్రాలకు పాతర.. శ్వేత పత్రాల జాతర, నిరుద్యోగుల మీద నిర్బంధలు, జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు ప్రశ్నిస్తే దాడులు, నేతన్నల ఆత్మహత్యలు ఇవి తప్ప తెలంగాణలో ప్రస్తుతం ఏమి కనబడటం లేదన్నారు.
Also Read:1000 మంది ఆర్టిస్టులతో #NKR21