KTR:కాంగ్రెస్ వాళ్లు సీరియల్ స్నాచర్స్

7
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం తీరు సీరియల్ కిల్లర్స్‌లా కాకుండా సీరియల్ స్నాచర్స్‌లా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ భూములు, విద్యాసంస్థలకు చెందిన భూములను వరుసగా కబ్జా చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. గతంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సుమారు 100 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుందని గుర్తు చేశారు. ఆ సమయంలో విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చేసినా, అక్కడ హైకోర్టు నిర్మిస్తామని చెప్పి భూమిని స్వాధీనం చేసుకున్నారని కేటీఆర్ తెలిపారు.

అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) విషయంలో కూడా దాదాపు 400 ఎకరాల భూమిని లాక్కోవడానికి ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఈ భూముల వ్యవహారంలో సుమారు 10 వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉన్నట్లు నిర్ధారణ అయినప్పటికీ, అప్పట్లో ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఒకవేళ ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చర్యలు తీసుకుని ఉంటే, నేడు ఉర్దూ యూనివర్సిటీ భూముల కబ్జా ప్రయత్నాలు జరిగేవి కావని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇటీవల ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) కు కూడా నోటీసులు ఇచ్చారని, అక్కడి నుంచి కూడా 100 ఎకరాల భూమిని లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోందని కేటీఆర్ ఆరోపించారు. విద్యాసంస్థల భూములను టార్గెట్ చేయడం దుర్మార్గమని, కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.

Also Read:తరుణ్ ..’ఓం శాంతి శాంతి శాంతిః’!

- Advertisement -