సర్కస్ నడుపుతున్నరా?..కేటీఆర్ ఫైర్

6
- Advertisement -

సర్కార్ నడుపుతున్నరా?…సర్కస్ నడుపుతున్నరా? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల నగరంలో నిన్న ఒక చిన్నారి తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. అదృష్టవశాత్తూ పాప ప్రాణాలు దక్కాయి.

చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోని మూడు విభాగాలేమో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి అన్నారు కేటీఆర్. తప్పు హైడ్రాది అని జీహెచ్ఎంసీ ప్రకటిస్తే తప్పు మాది కాదు జలమండలిది అని హైడ్రా చేతులు దులుపుకుంది.. ఆ వెంటనే అసలు మాకేం సంబంధం లేదని జలమండలి చేతులెత్తేసింది అన్నారు.

మున్సిపల్ శాఖను కేవలం కాసుల వేటకు వాడుకోవడంలో రేవంత్ బిజీగా ఉంటే,ఆయన శాఖలోని విభాగాలేమో సమన్వయలేమితో నగరవాసులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి అన్నారు.

Also Read:కాంగ్రెస్ కామారెడ్డి సభ వాయిదా

- Advertisement -