గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు సీఎం.
గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రముఖ ఆలయాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని శాశ్వత ఘాట్స్ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని ఆలయాలను క్షేత్రస్థాయిలో సందర్శించి అనువైన వాటిని ఎంపిక చేయాలన్నారు.
బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంతో పాటు ఇతర ప్రముఖ ఆలయాలను సందర్శించి జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఉన్న ఘాట్స్ ను విస్తరించడంతో పాటు రోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పుష్కరాల సమయంలో దాదాపు 2 లక్షల మంది ఒకేసారి ఘాట్స్ వద్ద స్నానమాచరించేందుకు వీలుగా ఉండేలా అభివృద్ధి చేయాలన్నారు సీఎం.
Also Read:సర్కస్ నడుపుతున్నరా?..కేటీఆర్ ఫైర్

