వరంగల్ వేదికగా ప్రతిపక్షాలపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ఎన్నికలు రాగానే సంక్రాంతికి గంగిరెద్దులోళ్లు వచ్చినట్లు ప్రతిపక్షాలు వస్తాయని వారి మాయలో పడవద్దని సూచించారు. వరంగల్‌లో వేల కోట్ల రూపాయాలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
అనంతరం మాట్లాడిన కేటీఆర్…తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదింది ఓరుగల్లు అన్నారు. పార్టీకి ఎప్పుడు బలం కావాలన్న మనం అతిపెద్ద ప్రజాగర్జన, బహిరంగ సభ ఇదే వరంగల్ గడ్డ అని గుర్తుచేశారు. వరంగల్ ప్రజలకు ఎప్పటికి రుణపడి ఉంటాం… ఓరుగల్లు బిడ్డలకు శిరసు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు.
గులాబీ జెండా 2001లో ఎగిరితే.. మళ్లీ అదిరిపోయి తెలంగాణ నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకుందని.. 2004 నుంచి 2014 వరకు పదేండ్లు సావగొట్టిందన్నారు. వేల మంది చావులను కండ్ల చూసింది. మీ అందరి పోరాటంతో ప్రజాశక్తి ముందు తలవంచక తప్పని పరిస్థితి వస్తే అనివార్యంగా కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ఏర్పాటుకు సహకరించాయన్నారు.
Also Read:RBI:వడ్డీ రేట్లు యథాతథం