KTR: కొడంగల్ ప్రజలను మెప్పించలేని రేవంత్!

6
- Advertisement -

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ లో అక్రమంగా భూములు గుంజుకోవద్దంటూ మా పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ధర్నా చేస్తే ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అక్కడ రైతుల మీద లాఠీ ఛార్జి చేశారు…ముఖ్యమంత్రి నీ కొడంగల్ నియోజకవర్గంలోనే ప్రజలను ఒప్పించకపోతే రాష్ట్రాన్ని ఎట్ల నడిపిస్తావ్? అన్నారు.

ఎన్ని రోజులు పోలీసులను పెట్టుకొని అరాచకాలు చేస్తావ్?, ప్రజాభిప్రాయం మేరకే వాళ్లను ఒప్పించి, మెప్పించి ఏ పరిశ్రమ అయిన పెట్టాలన్నారు. మా పార్టీ నేత నరేందర్ రెడ్డి రితో సహా మీరు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Also Read:సీతారామచంద్ర స్వామి ఆలయంలో జమ్మి చెట్టు

 

- Advertisement -