మహిళలపై పోలీసుల తీరు సరికాదు: కేటీఆర్

3
- Advertisement -

రాష్ట్రంలో 28 వేల ఆశా లు నిన్న శాంతియుతంగా మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి అని అడగడానికి కోఠికి వస్తే జూలుం చేశారు అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉస్మానియా ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..సోనియా గాంధీ బర్త్ డే రోజు మహిళలను ఇష్టం వచ్చినట్టు పోలీసులు కొట్టారు ..ఒక ACP దారుణంగా ఒక ఆడ బిడ్డ చీర లాగాడు అన్నారు.

24 గంటలు అయ్యింది పోలీసులపై ఏమి చర్యలు తీసుకున్నావ్…18వేలు జీతం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పింది మీరు కదా, కేసీఆర్ ప్రభుత్వం ఆశా ల జీతాలు పెంచాము అన్నారు. అత్యంత హేయంగా నిన్న ధమనఖాండ జరిగింది…16వ తేదీ అసెంబ్లీ ప్రారంభం కానుంది…ఆశా లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చాలన్నారు.

అసెంబ్లీలో నిన్న జరిగిన అంశాలు అన్ని లేవనెత్తుత్తం, మహిళా కమిషన్ కలుస్తాం ఈ విషయం తెలుపుతాం అన్నారు కేటీఆర్. మెరుగైన వైద్యం కావాలంటే బీఆర్ఎస్ పార్టీ కార్పొరేట్ వైద్యం కోసం వేరే హాస్పిటల్ తీసుకెళ్తాం…ఉస్మానియాలో మంచి సేవలు అందుతున్నాయి..వైద్యులకు అభినందనలు చెప్పారు.

Also Read:Janasena:జాతీయ రాజకీయాల్లోకి పవన్ కల్యాణ్ ?

- Advertisement -