HCUలో పెద్ద భూ కుంభకోణం.. !

5
- Advertisement -

హెచ్‌సీయూలో పెద్ద భూ కుంభకోణం జరిగిందని ఇందులో బీజేపీ ఎంపీ హస్తం ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్.కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ పెంచడం, గ్యాస్‌ ధరల పెంపుపై కేటీఆర్ మండిపడ్డారు. అమెరికా అడ్డగోలుగా పెంచిన నూతన టారిఫ్ వలన తెలంగాణకు భారీ నష్టం వస్తుందని చెప్పారు.

మూడు రోజుల్లో కుంభకోణం బయట పెడతానని… ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గుతున్నప్పటికీ భారత ప్రభుత్వం మాత్రమే గ్యాస్ పెట్రోల్ ధరలను పెంచుతోందని అన్నారు. ట్రంప్ తీసుకువచ్చిన నూతన టారిఫ్ విధానం పైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా మాట్లాడలేదని తెలిపారు.

తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా ఉన్న ఈ రెండు రంగాలకు దెబ్బ తగిలితే తెలంగాణ ఆర్థిక ప్రగతి దెబ్బతింటుందని కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్‌ సిల్వర్ జూబ్లీ బహిరంగసభను కనివని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నామని.. ఎల్కతుర్తిలో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా… ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాని ప్రాంతంలో సభ ఉంటుందన్నారు. 1200 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. 27వ తేదీ ఆదివారం కావడం, విద్యార్థులకు సెలవులు ఉండటం ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగవని అన్నారు. 33 జిల్లాల నాయకుల ప్రతినిధులతో కేసీఆర్ స్వయంగా నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారని తెలిపారు.

Also Read:కేసులకు భయపడేది లేదు!

- Advertisement -