KTR: రైతుల కోసం జైలుకెళ్లెందుకు రెడీ

4
- Advertisement -

రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆదిలాబాద్ జిల్లాలోని రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసిన రైత‌న్న‌ల ధ‌ర్నాలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. త‌ప్ప‌కుండా కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను ఉరికించి కొట్టే రోజులు ద‌గ్గర ప‌డ్డాయ‌ని అన్నారు.

వ‌న్ పోలీసింగ్ కావాల‌ని డిచ్‌ప‌ల్లి బెటాలియ‌న్ వ‌ద్ద‌ ధ‌ర్నా చేస్తున్నారు. ధ‌ర్నా చేస్తున్న మ‌మ్మ‌ల్ని ర‌క్తం కారేలా గుంజుకుపోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఆ ఆడ‌బిడ్డ‌లు. అఖ‌రికి కాంగ్రెస్ పాల‌న‌లో పోలీసోళ్ల భార్య‌లు ధ‌ర్నాలు చేసే ప‌రిస్థితి నెలకొందన్నారు. ప్ర‌జ‌లు, రైతుల కోసం ఒక‌ట్రెండు ఏండ్లు జైల్లో ఉండేందుకు సిద్ధం…. ఎవ‌నీ అయ్య‌కు భ‌య‌ప‌డేది లేదు అని తేల్చిచెప్పారు.

అస‌లు చీటింగ్ కేసులు ఎవ‌రి మీద పెట్టాలి.. తులం బంగారం ఇస్తామ‌ని చెప్పి మోసం చేసిన ఈ చార్ సౌ బీస్‌గాని మీద కేసులు పెట్టాలి. రైతుబంధు ఎగ్గొట్టి, రుణ‌మాఫీ చేయ‌నందుకు రైతులు కేసులు పెట్టాలి…ఇలా అన్ని వ‌ర్గాలు పోలీసు స్టేష‌న్ల ముందు లైన్లు క‌ట్టి చీటింగ్ కేసు పెడితే ఏ ఒక్క కాంగ్రెస్ నాయ‌కుడు కూడా ఈ రాష్ట్రంలో మిగల‌డు అని కేటీఆర్ తెలిపారు.

రేవంత్ రెడ్డి రాజు, చ‌క్ర‌వ‌ర్తి కాదు. చంద్ర‌బాబు, రాజ‌శేఖ‌ర్ రెడ్డి లాంటి నాయ‌కుల‌తోనే కొట్లాడినం.. వీడెంత చిట్టినాయుడు.. గింతంత మ‌నిషి.. వాని చూసి ఆగం కావొద్దు. ఉద్యోగులు ప‌ద్ధ‌తి ప్ర‌కారం ఉద్యోగం చేయండి అని సూచించారు.

Also Read:Jagan:డైవర్షన్ పాలిటిక్స్ ఇంకెన్నాళ్లు?

- Advertisement -