టీఆర్ఎస్ ప్రభుత్వం ..రైతు ప్రభుత్వం అన్నారు మంత్రి కేటీఆర్. రైతు రుణమాఫీ కోసం రూ. 1200 కోట్లు విడుదల చేసిన నేపథ్యంలో ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్… ఈ దశ రుణమాఫీ ద్వారా సుమారు 5.50 లక్షల మంది రైతులు లబ్ది పొందుతారని చెప్పారు.
వానాకాలం రైతుబంధుకు కూడా రూ. 7 వేల కోట్ల విడుదల చేయడంతో ఈ పథకం కింద 57 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో రెండు, మూడు రోజుల్లో నగదు జమ కానుందని వెల్లడించారు కేటీఆర్. లాక్‌డౌన్ నేపథ్యంలో రైతుల ఖాతాల్లోకే డబ్బులు నేరుగా జమ కానున్నాయి.
Telangana Govt’s commitment to farmers welfare
5.5 lakh farmers will be debt free as Hon’ble CM directed release of ₹1200 Cr towards farm loan waiver
Also directed release of approx ₹7,000 Cr towards farm input assistance; Flagship Rythu Bandhu helping over 57 lakh farmers👍 pic.twitter.com/5c4uaXKy7f
— KTR (@KTRTRS) May 8, 2020