చిట్టినాయుడు సుభాషితాలు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ట్రోల్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండు, కంప్యూటర్ ను కనిపెట్టింది రాజీవ్ గాంధీ కాదు చార్లెస్ బాబేజీ అన్నారు.
రాజీవ్ గాంధీ కంప్యూటర్ దేశానికి పరిచయం చేసిండు , Tata Institute of Fundamental Research Automatic Calculator (TIFRAC) వారు 1956లో ఇండియాలో తొలిసారిగా కంప్యూటర్ సేవలు ప్రారంభించారు అని తెలిపారు కేటీఆర్.
రాజీవ్ గాంధీ గారికి అప్పటికి 12 సంవత్సరాలు, ఎదో నోటికొచ్చింది వాగడం, ఆ తర్వాత దొరికిపోవడం ఎందుకు అని ప్రశ్నించారు. నీకు బాగా తెలిసిన రియల్ ఎస్టేట్ దందాలు, బ్లాక్ మెయిల్ వీటికి పరిమితం అయితే మంచిదమ్మా చిట్టి అని పరోక్షంగా రేవంత్‌ని ఉద్దేశించి కామెంట్ చేశారు కేటీఆర్.
చిట్టినాయుడు సుభాషితాలు
✳️ రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండు
❌ కంప్యూటర్ ను కనిపెట్టింది రాజీవ్ గాంధీ కాదు చార్లెస్ బాబేజీ
✳️ రాజీవ్ గాంధీ కంప్యూటర్ దేశానికి పరిచయం చేసిండు
❌ Tata Institute of Fundamental Research Automatic Calculator (TIFRAC) వారు 1956లో ఇండియాలో…
— KTR (@KTRBRS) September 17, 2024
Also Read:జానీ మాస్టర్‌కు జనసేనకు షాక్..