KTR:కాళేశ్వరంపై విచారణకు సిద్ధం!

44
- Advertisement -

గత తొమ్మిదిన్నరేళ్ల కాలంలో బి‌ఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం సాధించిన ప్రగతిపై బి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్ స్వేదపత్రం రిలీజ్ చేశారు. అన్నీ రంగాల్లో కూడా రాష్ట్రాన్ని అగ్రపథంలో నిలిపిన ఘనత బి‌ఆర్‌ఎస్ కే దక్కుతుందని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఇటీవల అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేద పత్రం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. గత బి‌ఆర్‌ఎస్ పాలనపై బురద చల్లే విధంగా ఉన్న కాంగ్రెస్ స్వేదపత్రానికి గట్టి సమాధానం ఇస్తూ కే‌టి‌ఆర్ విడుదల చేసిన స్వేదపత్రం కాంగ్రెస్ పాలకులకు చెంపపెట్టులా ఉంది. ఈ నేపథ్యంలో స్వేదపత్రంలో కే‌టి‌ఆర్ ప్రస్తావించిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల కాంగ్రెస్ విడుదల చేసిన స్వేదపత్రంలో ప్రభుత్వం తప్పుడు గణాంకాలు చూపిందని ఆయన అన్నారు. .

రాష్ట్రంపై ఉన్న అప్పు రూ.3.17 లక్షల కోట్లు కాగా దానిని రూ.6.70 గా కాంగ్రెస్ చూపుతోందని కే‌టి‌ఆర్ మండిపడ్డారు. లేని అప్పును ఉన్నట్టుగా చూపుతూ బి‌ఆర్‌ఎస్ పాలనపై బురద చళ్లే ప్రయత్నం మనుకోవాలని కే‌టి‌ఆర్ అన్నారు. 2014 లో రాష్ట్రం తలసరి ఆదాయం రూ.1.14 లక్షలు కాగా 2023 లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.17 కు చేరిందని, రాష్ట్రం సాధించిన ప్రగతికి ఇదే ప్రతిబింబంఅని కే‌టి‌ఆర్ వ్యాఖ్యానించారు. ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఎన్నో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యం కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణకు తాము సిద్దమని కే‌టి‌ఆర్ స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ లో తప్పు జరిగితే సరిచేయండి.. విచారణకు పూర్తిగా సహకరిస్తామని కే‌టి‌ఆర్ చెప్పుకొచ్చారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో బి‌ఆర్‌ఎస్ పై వస్తున్న విమర్శలక్,ఊ చెక్ పడినట్లయింది.

Also Read:ప్రజాపాలన నిర్వహిస్తున్నాం:సీఎం రేవంత్

- Advertisement -