నర్సంపేట మెడికల్ కాలేజీకి ‘పెద్ది’ పేరు:కేటీఆర్

1
- Advertisement -

తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ, సంస్మరణ సభ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో అత్యంత వైభవంగా, నడుమ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావులతో పాటు పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

సభకు చేరుకున్న కేటీఆర్, హరీష్ రావులు పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఎంతకాలం బతికినం అనేది కాదు.. ఎట్లా బతికినం అనేదే ముఖ్యం సంస్మరణ సభలో ప్రసంగించిన కేటీఆర్..పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజా జీవితాన్ని కొనియాడారు.

మనిషి ఎంతకాలం బతికాడనేది కాదు.. సమాజం కోసం, ప్రజల కోసం ఎట్లా బతికాడనేదే ముఖ్యం అని పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయం వద్దకు, ఆయన అంతిమయాత్రకు స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజాప్రవాహమే ఆయన సంపాదించుకున్న ప్రజాభిమానానికి నిదర్శనమని చెప్పారు.నర్సంపేట మెడికల్ కాలేజీకి సుదర్శన్ రెడ్డి పేరుసభ వేదికగా కేటీఆర్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. బిఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చాక, కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే నర్సంపేటలోని మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతామని స్పష్టం చేశారు.

Also Read:టీడీపీ ఎమ్మెల్యేకి జనసేన నేత వార్నింగ్

ఉద్యమకారుడిగా, నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోయేలా గౌరవించుకుంటామని కేటీఆర్ పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమరుడైన నాయకుడికి అశ్రునయనాలతో నివాళులు అర్పించారు.

- Advertisement -