ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు దక్కేది గుండు సున్న అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించిన కేటీఆర్.. ప్రతి రంగానికి ప్రతి వర్గానికి వెన్నుపోటు పోడిచారన్నారు. 6 గ్యారంటీలతోపాటు ఎన్నికల హామీలకు మంగళం పాడారని… అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్ ఇది అన్నారు.
ఇది 40% కమిషన్ల కాంగ్రెస్ బడ్జెట్.. ఇచ్చిన మాటకు కాకుండా ఢిల్లీకి మూటలు పంపడం పైననే దృష్టి పెట్టారన్నారు. ప్రజల కష్టాలు పైన ధ్యాస లేని బడ్జెట్- ప్రజాధనాన్ని పార్టీ పంచిపెట్టే కుట్ర అన్నారు. ఆటో డ్రైవర్ నుంచి మొదలుకొని అన్నదాత దాకా అందరికీ మోసమే… ఇది ట్రిలియన్ డాలర్ల అప్పు టార్గెట్ గా ఉన్న బడ్జెట్ అన్నారు. ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అన్నారు.
రేవంత్ రెడ్డి అసమర్థతకు, చాతకానితనానికి, పరిపాలన వైఫల్యానికి నిలువుటద్దం ఈ బడ్జెట్ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నమ్మి ఓటేసిన పాపానికి నాలుగు కోట్ల మందిని కాంగ్రెస్ నిలువునా ముంచిందని విమర్శించారు. పదేళ్ల ప్రగతి రథచక్రానికి పంచర్ చేసిన బడ్జెట్ ఇదని మండిపడ్డారు. ఇచ్చిన మాటకు కాకుండా ఢిల్లీకి మూటలు పంపడం పైననే బడ్జెట్ లో దృష్టి పెట్టారన్నారు. తెలంగాణ ప్రయోజనాలు, ప్రజల సంక్షేమానికి పెను ముప్పులా ఉన్న 40% కమిషన్ కాంగ్రెస్ బడ్జెట్ ను బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.
తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందనేది పాత సామెత. ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అవుతుందనేది కొత్త సామెత… కాంగ్రెస్ ఉంది అంటేనే కరెంటు ఉండదు, కాంగ్రెస్ కరోనా వైరస్ కంటే ప్రమాదం అన్నారు. కాంగ్రెస్ పాలనలో సంక్షేమానికి సమాధి.. అభివృద్ధి అడ్రస్ గల్లంతు అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలకు గోరి,కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రం 6000 కోట్ల రూపాయలను పప్పు బెల్లం లాగా పంచి పెట్టాలని అనుకుంటున్నారు. తెలంగాణ సొత్తును కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కాంగ్రెస్ కార్యకర్తలకు 6000 కోట్లు ఇవ్వడం యువ వికాసం కాదు తెలంగాణ వినాశనం అన్నారు.
Also Read:తెలంగాణ బడ్జెట్ 2025-26..హైలైట్స్

