KTR:అప్నా ట్యాంక్‌బండ్.. అప్నా హైదరాబాద్

78
- Advertisement -

విశ్వనగరమైన హైదరాబాద్‌ను స్వచ్ఛతలో ముందుంచాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా ట్యాంక్‌ బండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలను సుందరీకరిస్తున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగా శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన ట్యాంక్‌బండ్‌ను సాయంత్రం వేళ సెలవు దినాల్లో పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ పురపాలక శాఖ ట్విట్టర్ ద్వారా సందేశమిచ్చారు.

Also Read: KCR:కులవృత్తులకు అండగా ఉంటాం

మహానగరానికి మణిహారం ట్యాంక్‌బండ్! శతాబ్దాల ఘన చరిత్రకు ప్రతీక ట్యాంక్‌బండ్! అందుకు తగ్గట్టే… ట్యాంక్‌బండ్ సుందరీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఈ విశిష్ట నిర్మాణానికి మరిన్ని మెరుగులు అద్ది… ట్యాంక్‌బండ్‌ను అత్యంత అందంగా తీర్చిదిద్దింది తెలంగాణ ప్రభుత్వం అని కేటీఆర్ పేర్కొన్నారు. నగర ప్రజలకు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందిస్తూ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతున్న ట్యాంక్‌బండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడటం మనందరి బాధ్యత అని సూచించారు. మనం నివసించే ఇంటిలాగానే మనకు గర్వకారణం అయిన పర్యాటక ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నాను అని కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

Also Read: KTR:దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం

- Advertisement -