రేవంత్ రెడ్డి చేస్తున్న రూ.4,500 కోట్ల స్కాం బయటపెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియాతో మాట్లాడిన కేటీఆర్..గతంలో కొండపోచమ్మ సాగర్ నుండి గండిపేటలో నీళ్ళు పోయాలని రూ.1100 కోట్లతో చేస్తామని మా ప్రభుత్వం చెప్పిన ప్రాజెక్టును ఇప్పుడు రూ.5,650 కోట్లకు పెంచారు అన్నారు.
ఈ గొట్టం గాళ్ళకి భయపడే వాడు ఎవడు లేడని…పొంగులేటి ఐటీసీ కోహినూర్లో అదానీ కాళ్ళు పట్టుకున్నాడు అన్నారు. రేవంత్ రెడ్డి ఇంట్లో కరణ్ అదానీతో నాలుగు గంటలు సమావేశం జరిగింది.. వీళ్లకి లోపల లోపల దృఢమైన సంబంధాలు ఉన్నాయి అన్నారు. ఇదే రేవంత్ రెడ్డి డబల్ ఇంజన్లో ఒక ఇంజిన్ అదానీ.. ఒక ఇంజన్ ప్రధాని అని మాట్లాడిండు అన్నారు.
కానీ ప్రధాని కోసం దామగుండం అప్పజెప్పాడు, అదానీ కోసం రామన్నపేట అప్పజెప్పాడు.. మధ్యలో మూసీ మేఘా కృష్ణా రెడ్డికి ఇచ్చాడు అని ఆరోపించారు. ఒక్కొకటిగా వీళ్ళ బట్టలు అన్ని విప్పి నగ్నంగా నిలబెట్టే బాధ్యత మా పార్టీది అని తెలిపారు.
ఐఏఎస్ అధికారులకు, ఇంజనీర్లకు వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది తల ఊపి, ప్రాజెక్టులకు ఇష్టమొచ్చినట్లు బడ్జెట్లు పెంచితే, రేపు రేవంత్ రెడ్డి ఉద్యోగం ఊడినప్పుడు మీ ఉద్యోగాలు కూడా ఊడిపోతాయి అన్నారు. దొంగలు దొంగలు కలిసి ఉర్లు పంచుకున్నట్లు.. కొడంగల్ – నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి పంచుకున్నారు అన్నారు.
Also Read:Vijayamma: జగన్‌పై తప్పుడు ప్రచారమా?
కేసీఆర్ తలపెట్టిన పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులోని డిజైన్ మార్చి, కొడంగల్ – నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ అని మొదలెట్టి, రేవంత్ రెడ్డి తన ఈస్ట్ ఇండియా కంపెనీకి, పొంగులేటి తన రాఘవ కన్స్ట్రక్షన్ కి ఇచ్చుకున్నారు – కేటీఆర్ మార్కెట్ బాలేదని 50 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి స్క్వేర్ ఫీటుకి 100 రూపాయల చొప్పున RR ట్యాక్స్ వసూలు చేస్తున్నారు సుంకిశాల ఘటనలో అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ పత్రిక V6లోనే రాశారు అని గుర్తు చేవారు.
ఈ ప్రభుత్వం సొంత పత్రికలో వచ్చే వరకు అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు – కేటీఆర్ పొంగులేటి అందరినీ జైలుకి పంపుతానని నువ్వే జైలుకి పోయేలా ఉన్నావ్ అన్నారు. పొంగులేటి వాళ్ళు వీళ్ళు జైలుకి పోతారని అనడం కాదు ముందు నువ్వు ఎప్పుడు జైలుకి పోతావో చూస్కో అని చురకలు అంటించారు.