కెప్టెన్‌గా తొలి టెస్టు విజయాన్ని అందుకున్నాడు శుభ్‌మన్ గిల్. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 336 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. విజయం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సదరు రిపోర్టర్ కనబడపోవడంతో గిల్ సరదాగా అతడు ఎక్కడ అంటూ అడగడంతో అక్కడ నవ్వులు విరిశాయి.
దీనిపై స్పందించారు రవిచంద్రన్ అశ్విన్ . అతడు ఎక్కడా ‘షో’ చేస్తున్నట్లుగా లేదని.. తన అద్భుతమైన నైపుణ్యంతో భారత జట్టును నడిపిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. శుభ్‌మన్ గిల్‌కు సహజమైన నైపుణ్యం ఉంది అని తెలిపాడు. తన నైపుణ్యాలతో జట్టును నడిపిస్తున్న తీరు బాగుంది అని చెప్పాడు.
విదేశీ పర్యటనల్లో ప్రత్యర్థి జట్ల కెప్టెన్లను అక్కడి మీడియా లక్ష్యంగా చేసుకుంటుంది అని…ఎందుకంటే కెప్టెన్‌ను ఇబ్బంది పెడితే మిగిలిన జట్టు ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది అన్నాడు.
Also Read:బీజేపీ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

