అప్పారెల్ పార్కుకు పూర్వవైభవం తెస్తాం:కేటీఆర్

208
- Advertisement -

గుండ్లపోచంపల్లి అప్పారెల్ పార్కుకు పునర్వైభవం తీసుకుని వస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు స్ఫష్టం చేశారు. పార్కులో అన్ని యూనిట్లు ఖచ్చితంగా అప్పారెల్ రంగానికి చెందినవే అయిండాలని, ఈ పరిశ్రమలకు సంబంధం లేకుండా కార్యకలాపాలను నిర్వహిస్తున్న యూనిట్ల స్ధలాలను వెంటనే రద్దు చేయాలని టీఎస్‌ ఐఐసీ ఎండీ, అధికారులను అదేశించారు. అప్పారెల్ పార్కు అభివృద్ధిపై జరిగిన సమీక్షా సమావేశంలో పార్కులోని యూనిట్ల పనితీరు, ఉపాధి కల్పన, విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు.

ఈ పార్కులో అప్పారెల్ రంగానికి సంబంధంలేని ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అప్పారెల్ పార్కు నగరానికి అత్యంత దగ్గర ఉన్నందున అనేక కంపెనీలు ఇక్కడ యూనిట్లు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాయన్నారు. అలాంటి వారికి పారదర్శక పద్దతిలో తిరిగి ఈ ప్లాట్లను కేటాయిస్తామని మంత్రి తెలిపారు. ఈ అప్పారెల్ పార్కులోని అన్ని యూనిట్లు పనిచేస్తే కనీసం 15 వేల మందికి నేరుగా, అంతకు రెండు రెట్లు పరోక్షంగా ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉందన్నారు. పార్కు పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పించడమే ప్రధానం లక్ష్యంగా పనిచేయాలని అధికారులను అదేశించారు.

ktr review

పార్కులోని అన్ని యూనిట్లను తనీఖీ చేసి పూర్తి వివరాలను సేకరించాలన్నారు. ఒక్కో యూనిట్ అందిస్తున్న ఉపాధి, పెట్టుబడుల వంటి అంశాలపైన వారం రోజుల్లోగా నివేధిక ఇవ్వాలన్నారు. పార్కులో మౌళిక వసతుల కల్పనకే టియస్ ఐఐసి పరిమితం అవుతుందని, పార్కు నిర్వహాణ, నూతన యూనిట్లను పార్కుకు తీసుకుని రావడం వంటి కార్యక్రమాలను పూర్తిగా టెక్స్టైల్ శాఖ తీసుకుంటుదని మంత్రి తెలిపారు. టియస్ ఐఐసి పరిధిలో ఉన్న పాశమైలారం, గుండ్లపోచంపల్లి అప్పారెల్ పార్కులను పర్యవేక్షించేందుకు ముఖ్యనిర్వహాణాధికారి (సియివో) ఒకరిని ప్రత్యేకంగా నియమించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పార్కులో హ్యాండిక్రాప్ట్ శిక్షణ కేంద్రం, అర్టిసాన్ ట్రయినింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ పార్కుకు అవసరం అయిన అన్ని మౌళిక సదుపాయాల కల్పన చేసేందుకు టియస్ ఐఐసి చర్యలు తీసుకోవాలని కోరారు. పార్కులో ఏల్ ఈ డి లైట్లు, అహార భోజన శాల, రోడ్లు, గ్రీనరీ వంటి సౌకర్యాలను కల్పించాలని కోరారు. ఈ సమీక్షసమావేశంలో టీఎస్‌ ఐఐసీ,టెక్స్‌ టైల్‌ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -